ప్రపంచ వినాశనకారి నేను కాదు.. ట్రంప్: మండిపడ్డ ఉత్తరకొరియా అధినేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ తనను ప్రపంచ వినాశనకారిగా సంబోధిస్తుండడంపై కిమ్ మండిపడ్డారు. ప్రపంచ వినాశనకారిని తాను కాదని, అమెరికా అధ్
ప్యాంగ్యాంగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కౌంటర్ ఇచ్చాడు. ట్రంప్ తనను ప్రపంచ వినాశనకారిగా సంబోధిస్తుండడంపై కిమ్ మండిపడ్డారు.
పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని ట్రంప్ ఉల్లంఘించడాన్ని కూడా కిమ్ తప్పుబట్టారు. 194 దేశాలు సంతకాలు చేసిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బయటికి రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రపంచ వినాశనకారిని తాను కాదని, అమెరికా అధ్యక్షుడేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడానికి ముందుకు రాని ట్రంప్.. తన గురించి విమర్శలు చేయడం ఏమిటని కిమ్ జాంగ్ ఉన్ ప్రశ్నించారు.
ప్రపంచాన్ని కాలుష్యం కోరల నుంచి కాపాడటానికి 194 దేశాలు సంతకం చేస్తే.. ట్రంప్ మాత్రం వెనకడుగు వేశాడని, ఆయన ఓ సెల్ఫిష్ మ్యాన్ అంటూ మండిపడ్డారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆయన అహంకారాన్ని సూచిస్తోందని కిమ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications