అమెరికాపై ఎప్పుడైనా దాడి: కిమ్ జాంగ్ 3వ ప్రపంచ యుద్ధం హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ త్వరలో అమెరికాపై దాడి చేయనున్నారా? అందుకు సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు.

అమెరికాకు కిమ్ జాంగ్ సవాల్: ఉ.కొరియాకు మోడీ సడన్ షాక్

అమెరికా మిలిటరీ నిర్వహిస్తున్న డ్రిల్స్, రెచ్చగొట్టే పద్ధతుల పట్ల కిమ్ ఆగ్రహంగా ఉన్నారని, త్వరలోనే అణుదాడి చేయడానికి సిద్దంగా ఉన్నారని ఉత్తర కొరియా స్థానిక పత్రిక పేర్కొంది.

ఏ క్షణంలోనైనా అమెరికాపై దాడి

ఏ క్షణంలోనైనా అమెరికాపై దాడి

అమెరికా ప్రధాన భూభాగాలను ధ్వంసం చేసేందుకు సిద్దంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశముందని అందులో పేర్కొంది. జపాన్, దక్షిణ కొరియాతో కలిసి అమెరికా దళాలు నిర్వహిస్తున్న యుద్ధ సన్నాహాలే దీనికి కారణమని పేర్కొంది.

ధ్వంసం చేయగల టెక్నాలజీ.. అమెరికాకు హెచ్చరిక

ధ్వంసం చేయగల టెక్నాలజీ.. అమెరికాకు హెచ్చరిక

అమెరికాను ధ్వంసం చేయగల టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద ఉందని, జాగ్రత్తగా ఉండాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

మూడో ప్రపంచ యుద్ధానికి ట్రంప్ ప్రయత్నం

మూడో ప్రపంచ యుద్ధానికి ట్రంప్ ప్రయత్నం

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఉత్తర కొరియా ఆరోపించింది. జపాన్, సౌత్ కొరియాలతో కలిసి న్యూక్లియర్ ఫోర్సెస్‌ను రంగంలోకి దింపడం ద్వారా ట్రంప్ యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించింది.

కిమ్ జాంగ్ ఉన్‌ను కలుస్తానని ట్రంప్

కిమ్ జాంగ్ ఉన్‌ను కలుస్తానని ట్రంప్

మరోవైపు, కిమ్ జాంగ్‌ ఉన్‌ను సరైన సమయంలో కలుస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతనిని కలవడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. కిమ్‌ను కలవడం సరైనదని అనిపిస్తే తప్పకుండా ఆ పని చేస్తానని, అలా చేయడాన్ని గౌరవంగా భావిస్తానని అన్నారు.

కానీ, ఉత్తర కొరియా చేయాల్సిన పనులున్నాయి

కానీ, ఉత్తర కొరియా చేయాల్సిన పనులున్నాయి

అయితే ఆయనను కలిసేందుకు ఎటువంటి పరిస్థితులు ఉండాలి, ఎప్పుడు కలుస్తాను.. అన్న దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పటికిప్పుడైతే ఆ పరిస్థితులు లేవని, మీటింగ్‌కు ముందు ఉ.కొరియా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తర్వాత వైట్‌హౌస్ ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
NORTH Korea has accused Donald Trump of trying to start World War 3 by launching a show of nuclear force alongside the Japanese and South Korean military.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి