అణ్వస్త్రాలకు విరామం!: భార్య, సోదరితో కలిసి కిమ్ జాంగ్ ఉన్న పర్యటన

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యోంగ్‌యాంగ్: అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఇటీవలి వరకు వరకు అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో బిజీగా ఉన్నాడు.

తాజాగా తన భార్య, సోదరితో కలిసి పర్యటనకు వెళ్లాడు. ప్యోంగ్‌యాంగ్‌లోని ఓ కాస్మోటిక్ ఉత్పత్తుల ఫ్యాక్టరీకి వెళ్లిన ఆయన అక్కడి సదుపాయాలను పరిశీలించారు.

Kim Jong un visits cosmetics factory with wife and sister

కిమ్‌ తన భార్య రి సోల్‌ జు, సోదరి కిమ్‌ యో జాంగ్‌తో కలిసి ప్యాంగ్యాంగ్‌ కాస్మెటిక్స్‌ ఫ్యాక్టరీని సందర్శించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.

భార్యతో కలిసి ఉన్న కిమ్‌ చిత్రాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజ‌మాన్యంపై కిమ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల కలలను నిజం చేసే ఉత్పత్తులను తయారు చేస్తున్నారంటూ పొగిడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korean leader Kim Jong-un has visited a cosmetics factory in Pyongyang, accompanied by his wife Ri Sol-ju and sister Kim Yo-jong.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి