సరికొత్త అధ్యాయం: ఇంతకుముందు కామన్ మెన్, ఇప్పుడు దేశాధినేతలు, ఆప్ఘన్, చైనా గురించి డిస్కష్
ప్రధాని మోడీ- అమెరికా అధినేత జో బైడెన్ భేటీ ముగిసింది. గంటకు పైగా జరిగిన సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఇరువురు ఇదివరకే తెలుసు.. కానీ ప్రధానిగా, అధ్యక్షుడిగా తొలిసారి మీట్ అయ్యారు. ఇదీ భారత అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయంగా నిలుస్తోందని ఇరువురు నేతలు కామెంట్ చేశారు. అమెరికాలో గల 4 మిలియన్ల ఇండియన్ అమెరిక్లను ఈ దేశం మరింత శక్తివంతంగా అయ్యేందుకు కృషి చేస్తున్నారని బైడెన్ పేర్కొన్నారు. 2014, 2016లో బైడెన్‌ను కలిసిన సందర్భంలో అభిప్రాయాలను పంచుకున్నామని పేర్కొన్నారు.
ఆ సమయంలో భారత అమెరికా సంబంధాలు ఎలా ఉండాలో చెప్పారని మోడీ గుర్తుచేశారు. బైడెన్ మందుచూపు ఉన్న నేత అని కీర్తించారు. అతని ముందుచూపు తనకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆ సమయంలో చెప్పిన అంశాలను ఇప్పుడు ఆచరణలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని మోడీ తెలియజేశారు. 2006లో అమెరికా ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనిచేశారు. ఆ సమయంలోనే.. 2020లో భారత్ మరింత సన్నిహితంగా తమతో మెలగుతుందని చెప్పానని ఆయన గుర్తుచేశారు.

ఆప్ఘనిస్తాన్ పరిణామాలు, చైనా ఇంట్రెస్ట్.. ఇతర అంశాలు భారత్ అమెరికా బంధంపై ప్రభావం చూపుతాయని భావించారు. ఈ సమయంలో ద్వైపాక్షిక అంశాల చర్చకు సంబంధించి ఉత్కంఠ నెలకొని ఉండేది. కానీ ఇరువురు నేతలు ఒకరికొకరు ప్రశంసించుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications