వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దెబ్బ మీద దెబ్బ: పాక్ తో సహ ఐదు ముస్లీం దేశాల ప్రజలను బహిష్కరించిన కువైట్

|
Google Oneindia TeluguNews

కువైట్: ముస్లీం ప్రజలు అధికంగా ఉన్న ఏడు దేశాల ప్రజలను అమెరికాలో అడుగుపెట్టనివ్వం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో కువైట్ అడుగులు వేసింది. పాకిస్థాన్ తో సహ ఐదు దేశాల ప్రజలకు ఇక ముందు వీసాలు ఇవ్వమని కువైట్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.

పాకిస్థాన్ తో సహ సిరియా, ఇరాక్, అఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశ ప్రజలకు వీసాలు ఇవ్వరాదని కువైట్ ప్రభుత్వం ఆదేశ విదేశాంగ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఐదు దేశాల్లోని ముస్లిం ప్రజలు కువైట్ లో అడుగు పెట్టడానికి వీలు లేదని సంచలన నిర్ణయం తీసుకుందని గురువారం స్థానిక మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి.

ట్రంప్ ఏడు దేశాల ప్రజలను అమెరికాలో అడుగుపెట్టనివ్వం అని ఆదేశాలు జారీ చెయ్యకముందే కువైట్ సిరియా ప్రజలను కువైట్ లో అడుగుపెట్టనివ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 2011లోనే సిరియా ప్రజలకు వీసాలు ఇవ్వమని కువైట్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Kuwait bans visa for 5 Muslim-majority contries

సియా ముస్లీంలను లక్షంగా చేసుకుని మసీదు పై 2015లో ఉగ్రవాదులు దాడి చెయ్యడంతో కువైట్ కు చెందిన 27 మంది అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కువైట్ కు గల్ఫ్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యత్వం ఉంది. ఇప్పుడు జీసీసీ ఇరాన్ ప్రభుత్వం మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

1990 నుంచి జేసీసీ సభ్యత్వ దేశాల రక్షణ బాధ్యతలను అమెరికా చూసుకుంటున్నది. ఈ సందర్బంలోనే జేసీసీ సభ్యత్వం ఉన్న కువైట్ ఈ సంచలన నిర్ణయం తీసుకునింది. కువైట్ లో ఉన్న పాకిస్థాన్, సిరియా, ఇరాక్, అఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశ ప్రజలను ఆదేశం నుంచి బయటకు పంపించాలని అక్కడి ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతోంది.

English summary
Kuwait has suspended the issuance of visas for nationals of Pakistan, Iraq, Iran, Syria and Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X