కిమ్‌కు షాక్: కువైట్ నుండి దౌత్యవేత్తల బహిష్కరణ
దుబాయ్: వరుస క్షిపణి ప్రయోగాలు చేసిన ఉత్తరకొరియాకు ప్రపంచదేశాల నుండి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఉత్తరకొరియా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి.కువైట్‌లోని నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.
కువైట్ దేశం. కువైట్‌లోని ఉత్తరకొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.ఉత్తరకొరియా ఇటీవల అతిశక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే.
అమెరికా సహా ఆసియా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరకొరియా మిత్రదేశాలు తమ సంబంధాలుతెంచుకోవాలని ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కువైట్ ఈ నిర్ణయం తీసుకొంది.గల్ఫ్ దేశాలన్నింటిలో ఉత్తరకొరియాకు ఎంబసీ కువైట్‌లోనే ఉంది.
కువైట్, ఒమన్, ఖతార్, యూఏఈ లాంటి దేశాలకు ఉత్తరకొరియా నుండి జీవనం కోసం ప్రజలు వస్తుంటారు. అయితే వరుస అణుపరీక్షల కారణంగా కొరియాకు బుద్దిచెప్పేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకొంది.
దీంతో ఆర్థికంగా ఉత్తరకొరియాకు అడ్డుకట్ట వేసేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై కువైట్‌లోని ఉత్తరకొరియా ఎంబసీ ఇంకా స్పందించలేదు.













Click it and Unblock the Notifications