ప్రేమ జంట చివరిక్షణాలు: 13 హత్యలు, దోపిడీలు, గ్యాంగ్‌స్టర్ లవర్స్ ఫోటో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

టెక్సాస్: ఓ ప్రేమికుల జంట వరుస హత్యలు, దోపిడిలతో అమెరికాలోని టెక్సాస్ నగరాన్ని భయబ్రాంతులకు గురి చేశారు. అయితే ఎట్టకేలకు ఆ జంటను గుర్తించి పోలీసులు కాల్చి చంపారు. అయితే వారిని చంపే ముందు తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమించుకొన్న జంట దొంగతనాలను వృత్తిగా ఎంచుకొన్నారు. దొంగతనాల కోసం ఏకంగా హత్యలు చేయడమే పనిగా పెట్టుకొన్నారు. అమెరికాలోని టెక్సాస్ నగరమంతా భయబ్రాంతులకు గురయ్యేలా ఈ జంట వ్యవహరించింది.

ఎప్పుడు ఏం జరుగుతోందోననే భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. ఈ దంపతుల కోసం పోలీసులు తీవ్రంగా వేట సాగించేవారు. చాలా కాలం వరకు ఈ ప్రేమ జంట పోలీసుల కంటపడకుండా తప్పించుకొన్నారు.

 ఆ ప్రేమ జంట చివరిక్షణాలు

ఆ ప్రేమ జంట చివరిక్షణాలు

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ ప్రేమ జంట చివరిక్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చనిపోతామని తెలిసి తమ మధ్య ఉన్నప్రేమను ఒకరికొకరు తెలుపుకొంటుండగా ఓ ఫోటో గ్రాఫర్ ఫోటో తీశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తమ చివరి క్షణాల సమయంలో ఆ జంట అనుభూతిని ఫోటోగ్రాపర్ అద్భుతంగా బందించాడు.

ప్రేమలో పడ్డారిలా...

ప్రేమలో పడ్డారిలా...

బొనీ పార్కర్‌, క్లెడ్‌ బారోలు 1930లో కలుసుకున్నారు. తొలి చూపులోనే ప్రేమ చిగురించింది వీరిద్దరిలో. అయితే కొంతకాలానికి ప్రేమ విషయమై ఇద్దరు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. అప్పటి నుండి ఇద్దరు కూడ ప్రేమించుకొంటున్నారు. ఇద్దరూ కలిసి అనేక ఘటనల్లో పాలుపంచుకొన్నారు.

 పలు దొంగతనాలు

పలు దొంగతనాలు

1932-1934ల మధ్య వీరి నేరాల తీవ్రత ఎక్కువగా ఉంది.ఈ ప్రేమికుల జంట పలు నేరాలకు పాల్పడింది. వందలాది దోపిడిలకు పాల్పడ్డారు. దోపిడిలకు పాల్పడి క్షణాల్లో తప్పించుకొని పారిపోయేవారు. వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.

13 హత్య కేసులు

13 హత్య కేసులు

టోని పార్కర్, క్లెడ్ బారోల మధ్య 1930లో ప్రేమ చిగురించింది. అయితే 1932 నుండి 1934 మద్య కాలంలో పలు దోపిడిలకు పాల్పడింది ఈ ప్రేమ జంట. అంతేకాదు 13 హత్యలకు కూడ పాల్పడ్డారు. అయితే ఈ జంటపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు వారిని గుర్తించారు. టెక్సాస్‌లో మిస్సోరీలో వెంటాడి కాల్చివేశారు. అయితే కాల్చి చంపే ముందు తమ మద్య ప్రేమను వ్యక్తం చేసుకొనే ఫోటోను ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడ. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A photograph of a loved-up gangster couple, that was clicked shortly before they were gunned down, has gone viral.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి