అమెరికాలో మళ్లీ కాల్పులు: ప్రజాప్రతినిధికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

వర్జీనియా: అమెరికాకు చెందిన సీనియర్ చట్టసభ సభ్యుడు స్టీవ్ స్కేలైస్‌పై కాల్పులు జరిగాయి. వర్జీనియాలోని అలెంగ్జాండ్రియాలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

బేస్‌బాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి స్టీవ్‌ స్కాలిస్‌తో పాటు మరికొందరికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

Lawmaker Steve Scalise injured in GOP baseball shooting

దుండగుడు 50 నుంచి 100 రౌండ్ల కాల్పులు జరిపాడని తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన కాసేపటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ తర్వాత నిందితుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.

వర్జీనియా కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన చెప్పారు.

త్వరలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య బేస్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో వారంతా ప్రాక్టీస్‌లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A gunman unleashed a barrage of gunfire Wednesday at a park in Alexandria, Va., as Republican members of Congress held a morning baseball practice, wounding five people, including House Majority Whip Steve Scalise (La.).
Please Wait while comments are loading...