వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ లైంగిక వేధింపుల కలకలం: రాజీనామా, విచారణకు డెమోక్రాట్ల డిమాండ్, అధ్యక్షుడి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి చుట్టుముట్టాయి. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని 50 మందికి పైగా అమెరికన్‌ కాంగ్రెస్‌ మహిళా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పాలనా సంస్కరణల సభా కమిటీ ఛైర్మన్‌, ర్యాంకింగ్‌ మెంబర్‌కు రాసిన లేఖపై మహిళా ప్రతినిధులు సంతకాలు చేశారు.

అమెరికా అంతటా 'మీ టూ' క్యాంపెయిన్‌లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులను వివరిస్తూ ముందుకొస్తున్న క్రమంలో ట్రంప్‌ వ్యవహారాలపై దర్యాప్తును కోరుతున్నామని అమెరికన్‌ కాంగ్రెస్‌ మహిళా ప్రతినిధులు స్పష్టం చేశారు.

ట్రంప్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..

ట్రంప్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..

ఫ్లోరిడా లా మేకర్, డెమోక్రాటిక్ మహిళల వర్కింగ్ గ్రూప్(డీడబ్ల్యూడబ్ల్యూజీ) ఛైర్ పర్సన్ లోయిస్ ఫ్రాంకెన్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే పలువురు మహిళలు తమను ట్రంప్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని పలు మీడియా ఛానళ్లతో చెప్పడం గమనార్హం.

Recommended Video

US Not A Safe Place For Indians Because of Donald Trump - Oneindia Telugu

ట్రంప్ స్పందించాలి..

కాగా, ట్రంప్‌ తమను లైంగికంగా వేధించాడని 17మంది మహిళలు చేస్తున్న ఆరోపణలపై అధ్యక్షుడు స్పందించాలని, తనను సమర్ధించుకునేందుకు ఆయన తగిన ఆధారాలు సమర్పించాలని మహిళా సభ్యులు పేర్కొన్నారు.

అసభ్యకరంగా..

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు డొనాల్డ్ ట్రంప్‌ తమను అసభ్యకరంగా తాకాడని, బహిరంగ ప్రదేశాల్లోనే అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. గత రెండేళ్లుగా దాదాపు 17 మంది మహిళతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఈ ఆరోపణలు రావడంతో విచారణకు డిమాండ్ చేస్తున్నారు డెమోక్రాట్ సభ్యులు. అంతేగాక, అధ్యక్ష పదవికి ట్రంప్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరు వెలుగులోకి..

అమెరికా అధ్యక్షుడిపై తమ ఆరోపణలకు సంబంధించి యూఎస్‌ కాంగ్రెస్‌ విచారణ చేపట్టాలని ఆయనపై ఆరోపణలు గుప్పించిన ముగ్గురు మహిళలు ఇటీవల డిమాండ్‌ చేశారు. తాజాగా, మరికొంత మంది మహిళలు తమను ట్రంప్ లైంగికంగా వేధించాడని, బలవంతంగా తమ శరీర భాగాలను తాకాడని ఆరోపిస్తున్నారు. కాగా, వీరికి అమెరికా మహిళా చట్ట సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం

మరోవైపు తనపై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలను 71ఏళ్ల ట్రంప్‌ తోసిపుచ్చారు. తానింతవరకూ ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినీ లైంగికంగా వేధించలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మొన్నటి వరకు రష్యా అంశం తెరపైకి తెచ్చారని, ఇప్పుడు మహిళల లైంగిక వేధింపులంటూ మరోసారి తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని డెమోక్రాట్లపై ట్రంప్ మండిపడ్డారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై అధ్యక్షుడు ఇప్పటికే వివరణ ఇచ్చారని, నిరాధార ఆరోపణలుగా కొట్టిపారవేశారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సారా శాండర్స్‌ స్పష్టం చేశారు.

English summary
More than 100 Democratic lawmakers in the United States have signed on to a call for a House of Representatives oversight committee to probe sexual assault and harassment claims against President Donald Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X