లీటర్ పెట్రోల్ రూ. 2, లీటర్ వాటర్ రూ. 21.. ఆ దేశంలో అంతే మరి..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరాన్ ఇప్పటికే హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు సంక్షోభం నుంచి బయట పడేందుకు కొన్ని దేశాలు లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. తాజా పరిణామాల మధ్య అసలు ప్రపంచంలోనే తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశంగా లిబియా నిలిచింది. ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ. 2 మాత్రమే కావడం గమనార్హం.
గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. వనరుల కొరత, మధ్యప్రాచ్య సంఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితులు దీనికి కారణాలు. ప్రస్తుతం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో లీటరుకు రూ. 100కు పైగా సగటు ధరతో ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యధిక ధరల్లో ఒకటి.
అయితే కొన్ని చమురు సంపన్న దేశాలలో పెట్రోల్ ధర లీటరుకు కేవలం రూ. 3 మాత్రమే ఉంటుందని మీకు తెలుసా? 'గ్లోబల్ పెట్రోల్ ప్రైస్' నివేదిక ప్రకారం, లిబియా, ఇరాన్‌లలో ప్రపంచంలోనే అత్యంత చవకైన పెట్రోల్ దొరుకుతుంది. ఈ ధరలు రూ. 2.15 నుండి రూ. 3 మధ్య ఉంటాయి.
లిబియా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ అందించే అగ్ర దేశం. ఇక్కడ లీటరుకు కేవలం $0.024 (సుమారు రూ. 2.15)కి ఇంధనం విక్రయిస్తారు. ఉత్తర ఆఫ్రికాలోని ఈ చమురు సంపన్న దేశం తమ ప్రజలకు ఆర్థిక ఉపశమనం అందించడానికి పెట్రోల్‌ను అతి తక్కువ ధరకు అమ్ముతుంది.
చవకైన పెట్రోల్ జాబితాలో ఇరాన్ తర్వాతి స్థానం. ఇక్కడ ధరలు లీటరుకు $0.029 లేదా సుమారు రూ. 2.51. పాశ్చాత్య ఆంక్షలు, అమెరికా, ఇజ్రాయెల్‌తో వివాదాలున్నా, ఇరాన్ పౌరులకు చవకైన ఇంధనం అందించే సబ్సిడీ విధానాన్ని బలంగా కొనసాగిస్తోంది.
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చవకైన పెట్రోల్ అందించిన వెనిజులా, ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికాలోని ఈ దేశంలో, అమెరికా ఆంక్షలకు గురైనప్పటికీ, పెట్రోల్ ధరలు లీటరుకు $0.035 లేదా రూ. 3గా ఉన్నాయి, ఇది చవకైన వాటిలో ఒకటి. అయితే, వెనిజులాలో సబ్సిడీ పెట్రోల్ నెలకు 120 లీటర్లకే పరిమితం. తర్వాత సాధారణ ధర చెల్లించాలి.

లిబియా, ఇరాన్, వెనిజులాతో పాటు కువైట్, అంగోలాలో కూడా చవకైన పెట్రోల్ లభిస్తుంది. అంగోలాలో పెట్రోల్ సుమారు $0.33 లేదా లీటరుకు రూ. 27కి అమ్ముడవుతుంది.
-
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications