పెళ్లి వేడుకల మీద పిడుగుపాటు, 17 మంది మృతి - Newsreel

బంగ్లాదేశ్‌లో పిడుగుపాటు కారణంగా పెళ్లి వేడుకలోని 17 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
వరుడితో పాటు మరో 14 మంది గాయాల పాలయ్యారు. ఘటన జరిగిన సమయంలో వధువు ఆ వేడుకలో లేదు.
నది ఒడ్డున ఉన్న షిబ్‌గంజ్ నగరం నుంచి వివాహ వేడుక కోసం వరుని తరపు వారు పడవలో వధువు ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పడవలో ప్రయాణిస్తుండగా వారు పిడుగుపాటుకు గురయ్యారు.
పెళ్లి బృందాన్ని మెరుపులు అనేకసార్లు తాకినట్లు స్థానికులు పేర్కొన్నారు.
దక్షిణాసియా వ్యాప్తంగా ప్రతీ ఏడాది, వందలాది మంది ప్రజలు పిడుగుల కారణంగా మృత్యువాత పడుతున్నారు.

2016లో బంగ్లాదేశ్ ప్రభుత్వం పిడుగుపాటును ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. ఆ ఏడాది ఒక్క మే నెలలోనే 200 మంది పిడుగుపాటుతో మరణించారు. అందులో ఒకేరోజు గరిష్టంగా 82 మంది మరణాలు నమోదయ్యాయి.
అడవులు అదృశ్యం కావడం వల్లనే పిడుగుపాటు ప్రమాదాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పిడుగులను ఆకర్షించే పొడవైన చెట్లు లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications