దారుణం: బతికున్న గాడిదను పులులకు ఆహరంగా ఇచ్చిన జూ. సిబ్బంది (వీడియో)
తూర్పు చైనాలోని చాంగ్ చు జూలో సోమవారం సాయంత్రం దారుణం చోటుచేసుకొంది. తమ కళ్లముందే జరిగిన దారుణాన్ని చూసిన సందర్శకులు షాకయ్యారు. జూలో ఉన్న పులులకు బతికున్న గాడిదను ఆహరంగా వేయడం సోషల్ మీడియాలో వైరల్ గా
జూలో పులులకు ఆహారం వేసేందుకు సిబ్బంది ఓ వాహనంలో గాడిదను తీసుకొచ్చారు. దీనిని పులు ఉండే ప్రదేశంలోని కంచెవద్దకు తీసుకెళ్ళారు. వాహనంలో నుండి నేరుగా పులులు ఉండే ప్రాంతంలోకి బలవంతంగా తోసేశారు.
గాడిద సరాసరి నీటిలో పడిపోయింది. గాడిదను గుర్తించిన పులులు దాన్ని పట్టుకొన్ని పీక్కుతిన్నాయి. ప్రాణాలు రక్షించుకొనేందుకు గాడిద చేసిన ప్రయత్నం సందర్శకులతో కన్నీళ్ళు పెట్టించింది.

మూడుపులులు వచ్చి గాడిదను బతికి ఉండగాలనే చంపి తినేశాయి. జూ సిబ్బంది దారుణాన్ని కొందరు వీడియో తీసి నెట్ లో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పులికి ఆహరంగా బతికి ఉన్న జంతువును వేసి క్రూరంగా ప్రవర్తించారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సిబ్బందికి జాలి, దయ లేకపోవడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రకమైన దారుణాలకు జూ సిబ్బంది మానివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications