లండన్ ట్యూబ్ ట్రైన్‌లో పేలుళ్లు: పలువురికి గాయాలు
లండన్ : పార్సన్స్ గ్రీన్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం పేలుళ్ళు సంభవించాయి. ట్యూబ్ ట్రైన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. లండన్ మెట్రో పాలిటన్ పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
రైలు వెనుక భాగంలో ఓ బకెట్ నుంచి పేలుళ్ళు వినిపించాయని అంటున్నారు. సంఘటనా స్థలానికి భద్రతాధికారులు హుటాహుటిన తరలి వెళ్ళారు. తనిఖీలు నిర్వహించేందుకు రైల్వే స్టేషన్‌ను మూసివేశారు. చాలా మంది ప్రయాణికులు కాలిన గాయాలతో పరుగులు తీస్తున్నట్లు సమాచారం.

అత్యవసర సహాయక దళాలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ లండన్‌లో ఉంది. ఇది అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్. అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారని పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు.












Click it and Unblock the Notifications