వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుచి,ఆకలి లేకపోవటం,డయేరియాతోనే అధికంగా కరోనా ... గూగుల్ ట్రెండ్స్ తో గుర్తించిన మసాచుసెట్స్ అధ్యయనం

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు, డయేరియా వంటి లక్షణాలపై ఎక్కువమంది ఇంటర్నెట్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా బోస్టన్ లోని అగ్రశ్రేణి ఆసుపత్రి ఒక పరిశోధనలో గుర్తించింది.

కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరికకరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక

గూగుల్ ట్రెండ్స్ ద్వారా కరోనాపై అధ్యయనం

గూగుల్ ట్రెండ్స్ ద్వారా కరోనాపై అధ్యయనం

ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ కు సంబంధించిన 15 రాష్ట్రాలలో రుచి, ఆకలి కోల్పోవడంతో పాటు డయేరియాకు సంబంధించిన కోవిడ్ లక్షణాలపై ఎక్కువమంది గూగుల్ లో శోధన చేసినట్లుగా ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క గూగుల్ ట్రెండ్స్ ద్వారా గుర్తించారు. న్యూ యార్క్, న్యూ జెర్సీ, కాలిఫోర్నియా, మసాచుసెట్స్ మరియు ఇల్లినాయిస్ వంటి కరోనాకు హాట్ స్పాట్ గా మారిన రాష్ట్రాలలో జనవరి 20 నుండి ఏప్రిల్ 20 వరకు చాలా అధికంగా గూగుల్ శోధన జరిగినట్లుగా వారు గుర్తించారు.

 ఆకలి లేకపోవటం ,డయేరియా వంటి సమస్యలతోనే అధికంగా ఇబ్బంది పడుతున్న కోవిడ్ రోగులు

ఆకలి లేకపోవటం ,డయేరియా వంటి సమస్యలతోనే అధికంగా ఇబ్బంది పడుతున్న కోవిడ్ రోగులు

క్లినికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు హెపటాలజీ పత్రికలో ప్రచురించబడిన ఈ పరిశోధన ద్వారా అనేక విషయాలను ప్రస్తావించింది మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధన. ఒక దశాబ్దం కింద ఇన్ఫ్లుఎంజా పోకడలను పర్యవేక్షించడానికి ఉపయోగించిన విధానాన్ని కరోనా వైరస్ కోసం కూడా ఉపయోగించుకోవచ్చని ఆసుపత్రి ఈ నెలలో ఒక నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులు కడుపునొప్పి, విరోచనాలు వంటి జీర్ణాశయ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనం తెలిపింది. వారు సేకరించిన డేటా కరోనా వైరస్ సంక్రమించడానికి కారణమయ్యే జీర్ణాశయ సమస్యల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.

Recommended Video

How To Prevent Common Diseases During Rainy Season || వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు నివారణ మార్గాలు
 కరోనా అధ్యయనంలో గూగుల్ లో సెర్చ్ పాత్ర .. ఉపయుక్తంగా గూగుల్ ట్రెండ్స్

కరోనా అధ్యయనంలో గూగుల్ లో సెర్చ్ పాత్ర .. ఉపయుక్తంగా గూగుల్ ట్రెండ్స్

కరోనా మహమ్మారిని అంచనా వేయడానికి గూగుల్ ట్రెండ్స్ ఒక విలువైన సాధనంగా ఉండవచ్చని కూడా సూచిస్తుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కైల్ స్టాలర్, మరియు ఆయనతో కలిసి అధ్యయనం చేసిన సహచరులు పై అంశాలను పేర్కొన్నారు. గూగుల్ ట్రెండ్స్ లో ఎక్కువమంది జీర్ణ సమస్యలకు, కరోనా వైరస్ కు ఉన్న సంబంధాన్ని పరిశీలించినట్టుగా గుర్తించిన పరిశోధకులు యూఎస్ లో ఎక్కువమంది కరోనా బాధితులు రుచి తెలియకపోవడం ,ఆకలి లేకపోవడం, మరియు విరోచనాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గా గుర్తించారు. ఇదే విషయాన్ని వారు చేసిన అధ్యయనం ద్వారా వెల్లడించారు.

English summary
Corona virus studies are being conducted around the world at the time of the corona epidemic. A research by a top hospital in Boston has found that more and more people are trying to find out on the internet about symptoms such as loss of appetite, loss of taste, gastrointestinal problems and diarrhea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X