షాక్: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే 500 పాక్ వెబ్‌సైట్ల హ్యక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వ వెబ్‌సైట్లపై హ్యకర్లు దాడిచేశారు.పాకిస్థాన్‌లోని 500 వెబ్‌సైట్లపై హ్యాకింగ్ జరిగిందని సమాచారం.
పాక్ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకొంది. హ్యాక్‌కు గురైన వెబ్‌సైట్లలో భారత్‌ను కీర్తిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో అక్కడి అధికారులు ఖంగుతిన్నారు.

పాక్ ప్రభుత్వానికి చెందిన కీలకమైన వెబ్‌సైట్లు హ్యకింగ్‌కు గురికావడంతో ...ఆయా సేవలకు అంతరాయమేర్పడింది. ఈ వెబ్‌సైట్లను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.
లలూసెక్ ఇండియా అని పిలుచుకొంటున్న ఓ హ్యకర్ల బృందం ఈ హ్యకింగ్‌కు పాల్పడిందని పాకిస్థాన్ ఐటీ అధికారులు ప్రకటించారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.పాక్ హ్యకర్లు పలుమార్లు భారత సైట్లపై దాడిచేసేందుకు ప్రయత్నించడం..భారత్ ధీటుగా ఎదుర్కోవడం జరుగుతోంది.












Click it and Unblock the Notifications