US ransomware attack: అతిపెద్ద దాడి: మిలియన్ల కొద్దీ డాలర్లు డిమాండ్

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అతిపెద్ద సైబర్/రాన్‌సమ్‌వేర్ అటాక్ చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీల దిమ్మతిరిగి పోయే రేంజ్‌లో సంభవించిన దాడి అది. ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ కెసయా వీఎస్ఏపై దాడి చేశారు హ్యాకర్లు. 70 మిలియన్ డాలర్లను వారు డిమాండ్ చేశారు. భారతీయ కరెన్సీతో పోల్చుకుంటేే దీని విలువ 520 కోట్ల రూపాయలు. డార్క్ వెబ్‌సైట్ హ్యాపీ బ్లాగ్ ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానిస్తోంది.

ఈ దాడి వల్ల చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ప్రభావితమైనట్లు గుర్తించింది. హ్యాకర్లను రెవిల్ గ్యాంగ్‌గా నిర్ధారించింది. మేనేజ్డ్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్లపై సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు ఈ గ్యాంగ్ ముందే వెల్లడించింది కూడా. మిలియన్‌కు పైగా సిస్టమ్స్ ప్రభావితమైనట్లు తెలిపింది. ఈ దాడి నుంచి తాము వెనక్కి తగ్గాలంటే.. 70 వేల మిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంటుందంటూ రెవిల్ గ్యాంగ్ సూచించింది. ఈ డీల్ కుదిరిన గంట వ్యవధిలోనే సిస్టమ్స్ అన్నింటినీ రీస్టోర్ చేస్తామని తేల్చి చెప్పింది.

రాన్‌సమ్‌వేర్ అటాకర్లతో ఐటీ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్లు గనక ఈ డీల్‌ను కుదుర్చుకుంటే.. అదో చరిత్ర అవుతుంది. ఓ సైబర్/రాన్‌సమ్‌వేర్ దాడిలో ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడమనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఇదివరకు మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్ల మీద చోటు చేసుకున్న దాడిలో గరిష్ఠంగా 37 కోట్ల రూపాయల మేర డీల్ కుదిరింది. ఈ తరహా సైబర్ అటాక్‌లో కుదిరిన ఒప్పందాలు అత్యల్పంగా 33.5 లక్షల రూపాయలు.

major ransomware attack: IT software provider Kaseya VSA hit by REvil

తమ ఆధీనంలో ఉన్న 70 మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లపై ఈ అటాక్ ఎఫెక్ట్ పడినట్లు సీకో ఉపాధ్యక్షుడు రాస్ మెక్‌కెర్చర్ తెలిపారు. వాటివల్ల 350 కంపెల లావాదేవీలపై ప్రభావితమైనట్లు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూకే సహా అనే దేశాలు, రీజియన్ల నుంచి తాజాగా ఈ కెసయా రాన్‌సమ్‌వేర్ అటాక్ చోటు చేసుకున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. ఈ దాడి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.

రష్యాకు చెందిన రాన్‌సమ్‌వేర్ గ్యాంగ్స్ పని పట్టే ప్రయత్నాల్లో అమెరికా. దీనికోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తోనూ సంప్రదింపులను నిర్వహించింది. ఈ గ్యాంగ్స్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో- తాజా దాడి సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెవిల్ గ్యాంగ్ ఇదివరకు కూడా కొన్ని మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లను ఇబ్బందులకు గురి చేసినప్పటికీ.. ఈ సారి ఉన్న తీవ్రత అంచనాలకు మించి ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+