రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.
ఓస్లో: పాకిస్తాన్‌కు చెందిన సాహస బాలిక, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తాను తాలిబన్‌లో దాడిలో గాయపడినప్పుడు వేసుకున్న దుస్తులను చూసి చలించిపోయింది. రక్తంతో తడిసిన ఆ పాఠశాల యూనిఫాంను చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో తనతో పాటు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న భారత్‌కు చెదిన కైలాశ్ సత్యార్థి అక్కడే ఉన్నారు. మలాలను ఓదార్చారు.
నీవు చాలా ధైర్యవంతురాలివి అంటూ ఆయన ఆమెను ప్రశంసించారు. తాలిబాన్ దాడిలో మలాలా గాయపడినప్పుటి రక్తంతో తడిసిన నార్వే రాజధాని ఓస్లోలోని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్ననను మాలాలా, కైలాశ్ సత్యార్థి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పటి తన దుస్తులను చూసిన మాలాలా ఉద్వేగానికి గురైంది. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.

ఆ దుస్తులను 2012 అక్టోబర్‌లో మలాలా తాలిబాన్ కాల్పుల్లో గాయపడినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు భద్రపరిచారు. అమ్మాయిలు చదువుకోవాలని గట్టిగా చెప్పినందుకు తాలిబాన్ తీవ్రవాదులు 2012 అక్టోబర్‌లో పాకిస్తాన్ స్వాత్ వ్యాలీలో మాలాలాపై కాల్పులు జరిపి, హత్య చేయడానికి ప్రయత్నించారు.
కాల్పుల నుంచి మలాలా బతికి బయటపడింది. ఆమెకు ఇంగ్లాండులో సర్జరీ జరిగింది. ప్రదర్శనలో రక్తంతో తడిసిన స్క్వార్ఫ్, జాకెట్, ట్రౌజర్స్‌ను మలాలా చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో నువ్వు నాకు బిడ్డలాంటిదాదనివని అక్కున చేర్చుకు సత్యార్థి ఆమె తలపై ముద్దు పెట్టుకుని ఓదార్చారు. నోబెల్ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు మాలాలానే కావడం విశేషం.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..!












Click it and Unblock the Notifications