వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాలాల యుసుఫ్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ యువ సామాజిక కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్‌పై దాడి చేసిన 10మంది తాలిబన్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. ఉగ్రవాదులపై దాడిలో భాగంగా పోలీసులు, నిఘా సంస్థలు, సైన్యం జరిపిన ఆపరేషన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు మేజనర్ జనరల్ అసీం సలీమ్ బాజ్వా తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో పోలీసులకు కూడా భాగస్వాములైనట్లు చెప్పారు. 2012 అక్టోబర్‌లో వాయువ్య స్వాత్‌ లోయలో మలాలపై తెహ్రీక్ ఇ-తాలిబాన్ పాకిస్థాన్(టిటిపి) ముష్కరులు తలపై కాల్చారు. అదే సమయంలో ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు.

 Malala Yousufzai's attackers arrested: Pakistan Army

బాలికల విద్యా కోసం పోరాడినందుకు ఉగ్రవాదులు ఆమెపై దాడికి పాల్పడారు. అనంతరం మాలాలకు లండన్‌ని ఓ ఆస్పత్రిలో చికిత్స జరగగా అక్కడే కోలుకుంది. ఆ తర్వాత 2009లో బిబిసిలో వచ్చిన ఆమె ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన పాపులారిటీతో మాలాల నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ అయింది.
తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్‌లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె నిరుడు ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్నారు.

English summary
The 10 Taliban militants who tried to kill Pakistani teenage activist Malala Yousufzai for her outspoken views on girls' education in the country's troubled northwest in 2012 has been arrested, the army announced on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X