చనిపోయారు: ఎంహెచ్370పై మలేషియా, కో పైలట్ వల్లే ఎయిర్ ఏషియా..
కౌలాలంపూర్: గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం పైన మలేషియా గురువారం నాడు ఓ ప్రకటన చేసింది. ఎంహెచ్ 370 విమానం ప్రమాదమని, అందులోని ప్రయాణీకులు, క్రూ సభ్యులు మృతి చెందారని పేర్కొంది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి మలేషియా ప్రభుత్వం కంపన్షేషన్ ఇవ్వనుంది. మృతి విషయం తెలిసిందే అయినప్పటికీ... మలేషియా ప్రకటన చేసిన ప్రకటన ఆ విమానంలో ప్రయాణించి కుటుంబ సభ్యులకు ఒకింత ఆవేదన మిగిల్చేదే.

''భారమైన హృదయంతో, ఎంతో ఆవేదనతో మలేషియా ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తోంది. మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానానికి ప్రమాదం జరిగిందని మలేషియా అధికారికంగా ప్రకటిస్తోంది. అందులోని 239 మంది ప్రయాణీకులు, వారితో పాటు క్రూ మెంబర్స్ మృతి చెందార"ని సివిల్ ఏవియేషన్ చీఫ్ అజారుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ చెప్పారు.
ఎయిర్ ఏషియాపై...
ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత ఏడాది డిసెంబర్ కూలిపోయిన ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం కారణాల పైన చిక్కుముడి వీడుతోంది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవం లేని కో పైలట్ నడుపుతున్నాడని తేలిందని ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాఫ్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణీకులు, క్రూ సభ్యులు మొత్తం 162 మంది మృతి చెందారు. వారిలో ఇప్పటి వరకు 70 మృతదేహాలు దొరికాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications