కూలిన విమానం: 239మంది మృతి, 5గురు ఇండియన్స్
బీజింగ్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం సముద్రంలో కుప్పకూలిపోయినట్లు అధికారులు కూలిన విమానంలో భారతీయులు ఐదుగురు ఉన్నట్లు సమాచారం. మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానంలో 12 మంది సిబ్బందితోపాటు 227 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఈ విమానానికి తెల్లవారుజామున నుంచీ ఏటిసితో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విమానం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు విమానం సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. శనివారం ఉదయం 00:41 గంటలకు కౌలాలంపూర్ లో బయల్దేరిన ఈ విమానం ఉదయం 6.30గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది. కాగా శనివారం ఉదయం 2.40గంటలకు ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయని మలేషియా విమానయాన అధికారులు తెలిపారు.

వియాత్నం మీడియా కథనం ప్రకారం.. దక్షిణ పికూ ఐస్లాండ్ ప్రాంతానికి 153 మైళ్ల దూరంలో ఈ విమానం పడిపోయినట్లు పేర్కొంది. విమానంలోని 239 ప్రయాణికులలో ఐదుగురు భారతీయులు, 152 మంది చైనీయులు, 38 మంది మలేషియన్లతోపాటు ఆస్ట్రేలియా, అమెరికా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, కెనడా, రష్యా తదితర 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం.
విమానం కూలిపోయిందన్కాన సమాచారంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు కౌలాలంపూర్, బీజింగ్ విమానాశ్రయాల వద్ద బారులు తీరారు. కాగా తమ దేశానికి చెందిన విమానం కూలిపోయినట్లుగా ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు అందలేదని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications