రోమ్ కాఫీ షాప్ సమీపంలో కాల్పులు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
రోమ్: ఇటలీలోని రోమ్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర రోమ్‌లోని ఓ కాఫీ షాప్ దగ్గర ఆదివారం ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
ఈ ఘటనపై రోమ్ మేయర్ రాబర్టో గ్వాల్టీరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ నగరంలో జరిగిన తీవ్ర హింసాత్మకమైన ఘటన ఇదని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఫిడేన్ శ్రామిక వర్గ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ఆయన ధృవీకరించారు. కండోమినియం మీటింగ్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బాధిత కుటుంబాలను సోమవారం కలుస్తానని చెప్పారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు మొదట మీ అందర్నీ కాల్చి చంపేస్తాంంటూ అరుస్తూ బార్ లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత వెంటనే కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ముగ్గురు చనిపోగా, చాలా మంది గాయపడ్డారు.
ఈ క్రమంలో కొంత మంది నిందితుడ్ని పట్టుకుని.. పోలీసులు వచ్చిన తర్వాత వారికి అప్పగించారు. గతంలో కూడా నిందితుడు బోర్డు సభ్యులను బెదిరింపులకు గురిచేశాడని బాధితులు కొందరు తెలిపారు.












Click it and Unblock the Notifications