మహిళని చంపి, శవాన్ని తిన్నాడు: తగలబడ్తుంటే పెళ్లి
మాంచెస్టర్: ఓ వ్యక్తి మహిళను హత్య చేసి ఆమె శరీర భాగాలు తిన్న సంఘటన మాంచెస్టర్‌లో చోటు చేసుకుంది. 37 ఏళ్ల గ్రిగోరీ ఎస్ హేల్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం రాత్రి అతని నివాసంలో అరెస్టు చేశారు. అతని పైన హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గ్రిగోరీ ఎస్ హేల్ హత్య చేసినట్లుగా తమకు సమాచారం అందిందని చెప్పారు. సంఘటన స్థలానికి పోలీసులు అధికారులు చేరుకొని చూసేసరికి శవం ముక్కలుగా కనిపించిందని చెప్పారు. గ్రిగోరీ ఎస్ హేల్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం అతనిని కోర్టులో ప్రవేశ పెట్టారు. అతనిని కస్టడీలోకి తీసుకున్నారు. అతనిని న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

తగలబడుతుంటే పెళ్లి
ఓ జంట చుట్టూ అడవి తగలబడి పోతుంటే ఆ పక్కనే ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని ఓరేగాన్‌కు చెందిన మైకేల్ వాల్బర్, ఏప్రిల్ హార్ట్ లే ఆరు బయట ప్రకృతి మధ్యలో వివాహం చేసుకోవాలనుకున్నారు. బెండ్ సమీపంలో గత శనివారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి పెళ్లి సమయానికి పక్కనే ఉన్న అడవిలో కార్చిచ్చు మొదలైంది.
తక్కువ సమయంలోనే అది పెద్దదిగా మారింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయి వేరొక చోట పెళ్లి చేసుకోవాలని ఆ జంటకు సూచించారు. కానీ, వారు వినలేదు. కార్చిచ్చు సాక్షిగా వారు పెళ్లి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications