షాకింగ్: బాయ్‌ఫ్రెండ్‌కు తన రక్తం తాగించి.. ఆపై చంపబోయి..

Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: మనుషుల్లో కొన్ని విపరీత ధోరణులు ఒక్కోసారి వారిని ఎటువైపు నడిపిస్తాయో అర్థంకాదు. చిత్ర విచిత్ర ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కే కొన్నే ఘటనల గురించి విన్నప్పుడు.. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా? అన్న సందేహం కలగకమానదు.

ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఓ ప్రేమ జంట మధ్య పిశాచాల గురించి మొదలైన సంభాషణ నిజంగానే వారిని పిశాచాల్లా మార్చేసింది. తన రక్తం తాగాలంటూ ప్రియురాలు పట్టుబట్టడం.. తొలుత నిరాకరించినా.. ప్రేయసి కోరిక మేరకు ప్రియుడు ఆమె రక్తం తాగడం.. ఆపై ఇద్దరి మధ్య ఏదో వివాదం రేగడంతో.. ప్రియుడిని ప్రియురాలు దారుణంగా పొడిచేయడం జరిగిపోయాయి. ఈ దారుణం చోటు చేసుకుంది.

Man stabbed after drinking Springfield woman's blood, police say

నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో విక్టోరియా వనట్టెర్(19), ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మధ్య చోటు చేసుకుంటున్న సంఘటన ఇది. రేజర్ తో తన చేతిని కట్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ చేత రక్తం తాగించింది విక్టోరియా. అదే క్రమంలో.. ఇద్దరి మధ్య ఏదో వివాదం తలెత్తడంతో.. కత్తితో అతన్ని పొడిచేసింది. ఘటన జరిగిన కొద్దిసేపటికి విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.

ఆసుపత్రిలో వారిద్దరు కోలుకున్న తర్వాత ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఘటనపై పశ్చాత్తపడుతూ తనను క్షమించి వదిలేయాలని విక్టోరియా వనట్టెర్ కోర్టును వేడుకుంది. అయితే విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు మాత్రం 1.50 లక్షల డాలర్ల పూచికత్తుతో ఆమెకు జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was curious about sucking someone's blood, so Victoria Vanatter, 19, allegedly gave him permission to cut her arm with a razor and drink some of her blood in the kitchen of a Springfield home.
Please Wait while comments are loading...