సిరియాపై అమెరికా క్షిపణి దాడి?: తమకు సంబంధం లేదన్న పెంటగాన్..
డమార్కస్: సిరియాలో అమాయకులు బలైపోతూనే ఉన్నారు. తాజాగా సిరియా మిలిటరీ ఎయిర్ పోర్టుపై జరిగిన క్షిపణి దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికానే ఈ దాడులకు పాల్పడినట్టు మొదట అనుమానం వ్యక్తం చేసిన సిరియా స్టేట్ మిడియా.. ఆ తర్వాత దాన్నే ధ్రువీకరించింది. అమెరికానే దాడులకు పాల్పడిందని తెలిపింది.
'దౌమా'పై రసాయనిక దాడులకు 'ఎనిమల్ అసద్' మూల్యం చెల్లించాల్సిందేనని ట్రంప్ ట్వీట్ చేసిన గంటల్లోనే సిరియాపై దాడి జరగడం ఈ అనుమానాలకు ఊతమిచ్చింది.

మరోవైపు పెంటగాన్(అమెరికా రక్షణశాఖ) మాత్రం క్షిపణి దాడులను ఖండించింది. తాము దాడులకు పాల్పడలేదని పేర్కొంది. మరణాల సంఖ్యను నిర్దారించకపోయినప్పటికీ.. భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని సిరియన్ మీడియా తెలిపింది.
సిరియాలో పరిస్థితులకు ఆ దేశ అధ్యక్షుడు అసద్ తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ కూడా బాధ్యత వహించాలని ట్రంప్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications