దద్దరిల్లిన అమెరికా.. గన్‌కల్చర్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆటవిడుపులో ట్రంప్!
వాషింగ్టన్: గన్‌కల్చర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన, ప్రదర్శనలతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిల్లింది. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్న గన్‌కల్చర్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ శనివారం దేశవ్యాప్తంగా వందలాది మంది తమ నిరసన వ్యక్తం చేశారు.
14 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలవడంతో గన్‌కల్చర్‌పై ఫ్లోరిడాలోని స్టోన్‌మాన్ డగ్లస్ హైస్కూల్ విద్యార్థులు, సిబ్బంది ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం చరిత్రాత్మకమైన 'మార్చ్ ఫర్ అవర్ లైఫ్స్' కార్యక్రమానికి వీరిచ్చిన పలుపుకు భారీ స్పందన లభించింది.

ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు, సామాన్య జనాలు వాషింగ్టన్ నగరానికి పోటెత్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, సముదాయాలు, రోడ్లు జనంతో నిండిపోయాయి. తమ స్నేహితులు, తోటి విద్యార్థుల ప్రాణాలు కళ్లెదుటే పొతుంటే చూసిన విద్యార్థులు తమ బాధను ఈ వేదిక ద్వారా పంచుకున్నారు.
గన్‌కల్చర్‌ను నియంత్రించకపోతే అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గన్‌కల్చర్ నియంత్రణకు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జార్జ్ క్లోనే, అరియానా గ్రాండే, మిలే సైరస్, స్టీవెన్ స్పిల్‌బర్గ్, గ్లేన్ క్లోస్, చెర్ వంటి సెలబ్రిటీలు వాషింగ్టన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేవలం తొమ్మిదేళ్ల వయసున్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మనువరాలు యోలాండా కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించింది. అమెరికా వ్యాప్తంగా మరో 800 నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఇదిలావుండగా వీకెండ్ కావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా తన గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లారు. సాధారణంగా వీకెండ్స్‌లో ట్విట్టర్ ద్వారా స్పందించే ట్రంప్ దేశంలో ఇన్ని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నా ఈసారి ఎందుకో మౌనంగానే ఉండిపోయారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications