వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యతిరేక ఫలితాలకు క్షమాపణ, మరింత మెరుగ్గా ఫేస్‌బుక్‌: జుకర్‌బర్గ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫేస్‌బుక్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికీ క్షమాపణలు చెబుతున్నట్టుగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ చూపిన వ్యతిరేక ప్రభావానికి బాధ్యత వహిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్‌ ప్రజలను కలపడం కంటే విడదీయటానికి ఎక్కువ ఉపయోగపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఏ సంఘటననూ జుకర్‌బర్గ్‌ ప్రస్తావించలేదు.

.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా ఫేస్‌బుక్‌ను ఉపయోగించిందనడానికి సాక్ష్యాలు లభిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Mark Zuckerberg apologises for the way Facebook has been used to divide people

జుకర్‌ బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ చేస్తూ 'ఈ ఏడాది నేను ఎవరెవరిని బాధపెట్టానో వారందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఫేస్‌బుక్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేం దుకు ప్రయత్నిస్తాను' అని పేర్కొన్నారు.

2015 జూన్‌ నుంచి 2017 మే మధ్య ఓ రష్యా కంపెనీ ఇచ్చిన మూడు వేల ఫేస్‌బుక్‌ ప్రకటనల ప్రతులను కాంగ్రెస్‌కు సమర్పిస్తామని ఫేస్‌బుక్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ ప్రకటనల విలువ లక్ష డాలర్లు. 470 నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి ఈ ప్రకటనలు వచ్చాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.

English summary
Facebook founder Mark Zuckerberg has used the Jewish holiday of Yom Kippur to issue a public apology for the way his social media platform was used to divide people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X