ఉక్రెయిన్ దెబ్బ రష్యా విలవిల : పిట్టల్లా రాలుతున్న సైన్యం ! కీవ్‌లో ఈయూ దేశాల ప్రధానుల పర్యటన !!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. గత 20 రోజుల నుంచి బాంబులతో విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరు దేశాల ఇప్పటికే ఐదు సార్లు మధ్య చర్చలు జరిగాయి. అయినా పురోగతి మాత్రం కనిపించలేదు. ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరపోవడంతో మరోసారి ఇవాళ చర్చలు జరపాలని నిర్ణయించాయి. యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజు రోజుకు దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. క్షిపణులతో దాడులు చేస్తూ భయానక పరస్థితులను సృష్టిస్తోంది. ఈ దాడులతో సుందర నగరాలు మసి దిబ్బలుగా మారిపోయాయి.

రష్యా సేనలకు దీటుగా..
రాజధానీ కీవ్‌తోపాటు మరియోపోల్, ఖార్కీవ్, సుమీ నగరాల్లో మిస్సైల్స్‌తో రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. అటు రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. రష్యన్ సేనలకు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఈ యుద్ధపోరులో రష్యాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. రష్యాతో పోల్చితే తమ బలం, బలగం తక్కువైనా రష్యా దళాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు కలిగిన నష్టంపై ఉక్రెయిన్ విశాంగ శాఖ ట్విట్ ద్వారా వెల్లడించింది.
పిట్టల్లా రాలుతున్న రష్యా సైన్యం
తమ ప్రతిఘటనతో 13,500 మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు 404 యుద్ధ ట్యాంకులు, 95 హెలికాప్టర్లు, 81 యుద్ధ విమానాలు, 1279 ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా 640 యుద్ధ సామాగ్రి వాహనాలు, 36 యాంటీ ఎయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ రష్యా నష్టపోయినట్లు వివరించింది. అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతున్నాయి. యుద్ధ సామాగ్రిని, నిధులను సమకూర్చుతున్నాయి. ఉక్రెయిన్ అండగా నిలుస్తున్నాయి. దీంతో రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ బలంగా ఎదుర్కొంటోంది.

కీవ్‌కు ఈయూ దేశాల ప్రధానులు.
రాజధాని కీవ్‌లో రష్యా సేనలు దాడులకు తెగబడుతున్నాయి. ఈనేపథ్యంలో ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలుస్తున్నాయి. తాజాగా పోలాండ్, స్లోవేనియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు కీవ్‌కు వెళ్లనున్నారు. వారంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ దేశాలు భారీ రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ స్వాతంత్య్రం కోసం, సార్వభౌమాధికారం కోసం ఈయూ మద్దతు ఇస్తుందని తెలిపేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు సమాచారం. కీవ్‌లో పర్యటన వివరాలను చెక్ రిపబ్లిక్ ప్రధాని వెల్లడించారు.












Click it and Unblock the Notifications