వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహకు కూడా అందని విధ్వంసం, శవాల గుట్టలే!: ఉ.కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

తాము గనుక అణుయుద్దానికి దిగితే ఉత్తరకొరియాతో పాటు జపాన్, దక్షిణ కొరియాల్లో శవాల గుట్టలు తేలుతాయని హెచ్చరించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియా దుందుడుకు వైఖరి పట్ల సహనాన్ని ప్రదర్శిస్తున్న అమెరికా.. తాము గనుక యుద్దానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో వివరించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణశాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

గువాం ద్వీపంపై దాడి చేస్తామంటూ ఊగిపోతున్న ఉత్తరకొరియాకు ఆయన ఝలక్ ఇచ్చారు. అదే గనుక జరిగితే ఎదురుదాడికి తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. తాము గనుక యుద్దానికి దిగితే అది ఒక్క ఉత్తరకొరియాకే నష్టం కాదని, దాని పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ కూడా తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు.

Kim jong un

అమెరికా అణుదాడికి ఈ మూడు దేశాల్లో శవాల గుట్టలు కనిపించేవని, దాని తీవ్రత ఊహించినంత భయంకరంగా ఉంటుందని తెలిపారు. 30 సెకెన్లకు 30,000 మంది, అరగంటలో 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయితే అలా జరగకూడదని అమెరికా భావిస్తున్నది గనుకే అమెరికా ఓపికతో వ్యవహరిస్తుందని తెలిపారు.

అణుదాడులు ప్రపంచ వినాశనానికే తప్ప అంతకుమించి వాటితో సాధించేది ఏమి లేదని తెలిపారు. అణుదాడుల తీవ్రత ప్రభావం ఒక్క ప్రాంతానికే పరిమితం కాదన్నది గుర్తెరగాలన్నారు.

అమెరికాపై దాడులే మా సమాధానం: ఐరాసకు ఉ.కొరియా సంచలన సమాధానం..అమెరికాపై దాడులే మా సమాధానం: ఐరాసకు ఉ.కొరియా సంచలన సమాధానం..

English summary
In a press conference Thursday alongside their Japanese counterparts, Defense Secretary James Mattis and Secretary of State Rex Tillerson parted ways with White House strategist Steve Bannon on North Korea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X