• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో ఆగం కథ.. లాక్ డౌన్ ఎత్తివేతపై రగడ.. అసలేం జరుగుతోంది..

|

అమెరికాలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడి నిర్ణయాలను స్వాగతించే గవర్నర్లు కొందరైతే.. ధిక్కరించేవాళ్లు మరికొందరు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఒకే తీరుగా అమలుకాని పరిస్థితి. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల విషయంలోనూ అదే జరుగుతోంది. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు 'ఓపెనింగ్ అప్ అమెరికా అగైన్'ను స్వాగతిస్తుండగా.. మరికొందరు గవర్నర్లు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు ప్రజల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో నిరసనకారులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. కొన్నిచోట్ల నిరసనకారులను హెల్త్ కేర్ సిబ్బంది అడ్డుకుంటున్నారు. దీంతో అమెరికాలో పరిస్థితి గందరగోళంగా మారింది.

ఏకాభిప్రాయం లేని గవర్నర్లు..

ఏకాభిప్రాయం లేని గవర్నర్లు..

లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుండటంతో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే సడలింపులు ప్రకటించారు. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రాల గవర్నర్లదే. దీంతో కొన్ని రాష్ట్రాల గవర్నర్లు లాక్ డౌన్ ఎత్తివేసేందుకు సిద్దమవగా.. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం సుముఖంగా లేరు. ముఖ్యంగా మిడ్‌వెస్ట్‌లోని మిచిగాన్,ఓహియో,ఇల్లినాయిస్ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు ఆర్థిక వ్యవస్థ కంటే తమ పౌరులు,హెల్త్ కేర్ సిబ్బందిని కాపాడుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. న్యూయార్క్ గవర్నర్ క్యుమో కూడా ట్రంప్ ఆదేశాలను పక్కనపెట్టేశారు. అమెరికాలో కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది న్యూయార్క్ నగరమే కాబట్టి.. మే 15వరకు అక్కడ లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు.

రోడ్ల పైకి నిరసనకారులు.. అడ్డుకుంటున్న హెల్త్ కేర్ సిబ్బంది..

లాక్ డౌన్ ఎత్తివేసేందుకు గవర్నర్లు సుముఖంగా లేని రాష్ట్రాల్లో కొంతమంది నిరసనకారులు రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అయితే వీళ్లంతా ట్రంప్ అనుకూల ఆర్గనైజేషన్స్ అని.. రాబోయే ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే అనుకూల క్యాంపెయిన్స్ మొదలుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల పైకి వస్తున్న నిరసనకారులను హెల్త్ కేర్ సిబ్బంది అడ్డుకుంటున్నారు. రోడ్లపై నిరసనకారుల కార్లకు అడ్డంగా నిలుచుంటున్నారు. దీంతో వాహనాల హారన్స్ గట్టిగా మోగిస్తూ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. అడ్డు తప్పుకోవాలంటూ నిరసనకారులు హెల్త్ కేర్ సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. మీరు ఉద్యోగాల్లోకి వెళ్తున్నప్పుడు మేము మాత్రం ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, 'ఇది స్వేచ్చకు ప్రాధాన్యతనిచ్చే నేల' అని ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తున్నారు.

ట్రంప్ ప్రోత్సాహం వల్లేనా..

ట్రంప్ ప్రోత్సాహం వల్లేనా..

మిచిగాన్,కెంటకీ,వాషింగ్టన్,మిన్నెసొట,వర్జినియా,కొలరాడో,ఒరెగాన్,టెక్సాస్,అరిజోనా,న్యూహాంప్‌షైర్,పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను కూడా లెక్కచేయకుండా వీరు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా 22 మిలియన్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. కాబట్టి లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ ప్రోత్సాహం వల్లే వీరంతా ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతుతున్నాయి. ఆంక్షలను సడలించాలంటూ స్వయంగా ట్రంప్ ట్వీట్ చేయడం వీరికి మద్దతునివ్వడమేనంటున్నారు.

ప్యూ రీసెర్చ్ సర్వే ఏం చెబుతోంది..

ప్యూ రీసెర్చ్ సర్వే ఏం చెబుతోంది..

ఓవైపు నిరసనకారులు రోడ్డెక్కి లాక్ డౌన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంటే.. ఇప్పటికీ చాలామంది అమెరికన్లు మాత్రం ఇళ్లకే పరిమితమై లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఇటీవల ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. అమెరికాలో 73శాతం మంది అమెరికన్లు.. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఇకముందున్నాయి అని అభిప్రాయపడ్డారు. 66శాతం మంది అమెరికన్లు ఎక్కడ తమ రాష్ట్రాలు లాక్ డౌన్‌ను త్వరగా ఎత్తివేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. మరో 32 శాతం మంది అమెరికన్లు తమ రాష్ట్రాలు లాక్ డౌన్‌ను త్వరగా ముగిస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.వరుసగా 14 రోజుల పాటు కొత్త కేసుల సంఖ్య తగ్గితేనే లాక్ డౌన్‌ను ఎత్తివేయమని వైట్ హౌజ్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మొత్తం మీద అమెరికాలో లాక్ డౌన్ ఎత్తివేయాలని కొందరు రోడ్ల పైకి రావడం,హెల్త్ కేర్ సిబ్బంది వారిని అడ్డుకోవడం,మెజారిటీ ప్రజలు లాక్ డౌన్ పొడగింపును కోరుకుంటుండటం.. ఇవన్నీ అక్కడ గందరగోళ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

English summary
A Pew Research Center survey last week found 66% of Americans are concerned that restrictions will be lifted too quickly, as opposed to 32% who are worried they will not be lifted soon enough. In addition, the survey found most of the country - regardless of party affiliation - believes the worst of the pandemic is yet to come.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X