పగబట్టిన ప్రకృతి... మెక్సికోలో మళ్లీ భూకంపం, తీవ్రత 6. 2గా నమోదు

రెండు వరుస భూకంపాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే మెక్సికోలో శనివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు.

మెక్సికో: భూ కంపాల ధాటికి మెక్సికో వణుకుతోంది. కేవలం రోజుల వ్యవధిలోనే సంభవించిన రెండు వరుస భూకంపాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే శనివారం మరోసారి భూమి కంపించింది.

రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. చియాపస్‌లోని శాన్‌ లుక్వెనోకు 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.

mexico-earthquake

ఇటీవల ప్రకృతి ప్రకోపానికి మెక్సికో విలవిల్లాడిపోయింది. రోజుల వ్యవధిలో వరుస భూకంపాలు సంభవించిన ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నెల 8న 8.2 తీవ్రతతో అతిశక్తిమంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 92 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత 11 రోజులకు మరోసారి 7.1 తీవ్రతతో భూమి కంపించింది. వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇప్పటికీ సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజాగా శనివారం కూడా భూమి కంపించడంతో మెక్సికో వాసులు వణికిపోతున్నారు. తమపై ప్రకృతి పగబట్టిందంటూ వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+