ఎంహెచ్ 370: రూ. 800 కోట్లు దాటిన గాలింపు ఖర్చు

లాలంపూర్: 11 రోజుల క్రితం 239 మంది ప్రయాణికులతోపాటు అదృశ్యమైన మలేసియా విమానం కోసం ఇప్పటి వరకు మలేషియా ప్రభుత్వం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. అయినా అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ లభించలేదు. రోజులు పెరుగుతున్న కొద్దీ... గాలింపు కోసం చేసే వ్యయం కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. కాగా ఇప్పటి వరకు మలేషియా ప్రభుత్వం రూ. 800 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మలేషియా ప్రభుత్వం గాలింపు చర్యలను నిలిపేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

విమానం అదృశ్యమైన ఘటన జరిగే నాటికే మలేషియా ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయితే విమాన ప్రయాణికుల రక్షణ అనేది దేశ ప్రాధాన్యం గల అంశం కావడంతో ఇప్పటి వరకు విమానం కోసం గాలింపునకు అయ్యే ఖర్చులు వెచ్చించేందుకు మలేషియా ప్రభుత్వం వెనకాడలేదు. కాగా అదృశ్యమైన విమానంలోని బంధువులు కూడా మలేషియాకు చేరుకున్నారు. వారి లాడ్జింగ్, ఆహారం ఇతరాల కోసం వారందరూ సుమారు 5వేల డాలర్లు ఖర్చు చేశారు.

MH 370

కాగా, అదృశ్యమైన విమానం గాలింపులో ఇప్పటికే 26 దేశాలు పాల్గొంటున్నాయి. వియాన్నాకు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాంప్రెహెన్సివ్ న్యూక్లియర్-టెస్ట్ బ్యాన్ ట్రీటి ఆర్గనైజేషన్(సిటిబిటిఓ) కథనం ప్రకారం.. విమానం గల్లంతైన రోజు ఆ ప్రాంతంలోని గగనతలంలో ఎలాంటి పేలుళ్లూ సంభవించలేదని స్పష్టం చేసింది. నీటిలో మునిగినట్లు ఇప్పటికైతే గుర్తించలేదని సిటిబిటిఓ పేర్కొంది.

ఇప్పటి వరకు మొత్తం 2.24 మిలియన్ చదరపు నాటికల్ మైళ్ల (77లక్షల చదరపు కిలోమీటర్ల) విస్తీర్ణంలో అన్వేషణ కొనసాగిస్తున్నట్టు మలేసియా మంత్రి హిషముద్దీన్ మంగళవారం ప్రకటించారు. తమ దృష్టి ప్రస్తుతం మధ్య ఆసియా, హిందూ మహాసముద్రంపైనే ఉన్నట్టు ఆయన వివరించారు. ఇంతటి భారీస్థాయి అన్వేషణ చేయగల సామర్థ్యం మలేసియాకు లేదని.. ఇందులో తమకు 26 దేశాలు సహకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కిందపడుతున్న విమానాన్ని చూశాం: మాల్దీవియన్స్

మాలే: మలేషియా విమానం అదృశ్యమైన రోజే.. తాము కిందకు పడుతున్న ఓ విమానాన్ని చూశామని మాల్దీవుల్లోని పలువురు ప్రజలు పేర్కొన్నారని ఆ దేశంలోని మీడియా తెలిపింది. మార్చి 8న ఉదయం 6.15గంటలకు కిందపడిపోతున్న విమానాన్ని చూశామని, ఆ తర్వాత అది అదృశ్యమైపోయిందని అక్కడి ప్రజలు చెప్పినట్లు మీడియా కథనం వెల్లడించింది. తెల్లగా ఉన్న ఆ విమానంపై ఎరుపుచారలున్నాయని తెలిపారు. మాల్దీవులు-అద్దు ద్వీపానికి ఆగ్నేయం వైపు విమానం వెళ్లిందని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+