వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370 గల్లంతు: పెదవి విప్పిన పైలట్ ఫ్యామిలీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: ఈ ఏడాది మార్చి 8వ తేదీన గల్లంతైన మలేషియా ఎంహెచ్ 370 విమానం పైలట్ తన భార్యతో మాట్లాడారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారట.

ఎహెచ్ 370 విమానం గల్లంతై దాదాపు మూడున్నర నెలలు దాటింది. అయినా ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. అయితే దీనిపై పైలట్ జహారీ అహ్మద్ షా కుటుంబ సభ్యులు పెదవి విప్పలేదు.

అయితే, ఇప్పుడు జహారీ భార్య తన మౌనాన్ని వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి. జహారీ విమానం కాక్‌పిట్ నుండి తన భార్యతో ఫోన్లో మాట్లాడారట.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఈ ఏడాది మార్చి 8వ తేదీన 239 మందితో కూడిన మలేషియా విమానం ఎంహెచ్ 370 గల్లంతైన విషయం తెలిసిందే. దీని కోసం సెర్చ్ చేస్తున్నారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఇదిలా ఉండగా... ఎంహెచ్ 370 విమానం గల్లంతు పైన ఇద్దరు పుస్తకం రాస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు దీని గురించి తెలుసుకునేందుకు పైలట్ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు.. తన భర్త తనతో కాక్ పిట్ నుండి మాట్లాడినట్లు ఆమె చెప్పారట.

 ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

కౌలాలంపూర్ నుండి ఎంహెచ్ 370 విమానం టేకాఫ్ అయిన గంటలోపే జహారీ అహ్మద్ షా కాక్ పిట్ నుండి తన భార్యతో ఫోన్లో మాట్లాడారట.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

మరోవైపు, గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం దశాబ్దాలు పట్టవచ్చునని మలేషియా ఎయిర్ లైన్స్ బాస్ చెప్పినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

బ్రిటిష్ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన గల్లంతైన మలేషియా విమానం విషయమై స్పందించారట. విమానం సముద్రంలో గల్లంతవడమంటే ఓ కాంక్రీట్ గోడను ఢీకొన్నట్లేనని ఆయన అభిప్రాయపడ్డారట. విమానానికి సంబంధించిన శిథిలాలు సముద్రంలో చెల్లా చెదురు అవుతాయని, సముద్రంలో పెద్ద ఎత్తున విస్తరిస్తాయని ఆయన చెప్పారట.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

సముద్రంలో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయని, పెద్ద పెద్ద లోయలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎంహెచ్ 370 విమానాన్ని గుర్తించేందుకు చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారట. ఇందుకు దశాబ్దాలు పట్టవచ్చునని ఆయన చెప్పారని తెలుస్తోంది.

 ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 కోసం హిందూ మహాసముద్రం దక్షిణంగా గాలించాలని ఇటీవల నిర్ణయించారు. తొలుత ఎక్కడైతే విమానం కూలిపోయి ఉంటుందని అనుమానించారో ఆ ప్రాంతంలోనే గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

English summary
Investigators have concluded that Malaysia Airlines Flight 370, which veered off course and disappeared March 8, was probably not seriously damaged in the air and remained in controlled flight for hours after contact with it was lost, until it ran out of fuel over the southern Indian Ocean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X