అమెరికా రోడ్డు ప్రమాదంలో హైద్రాబాదీ మృతి
వాషింగ్టన్/హైదరాబాద్: అమెరికాలోని అలబామలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో తార్నాక నుంచి కంప్యూటర్ సైన్స్ చదవడానికి వెళ్లిన మాథ్యూస్ మృతి చెందాడని తెలుస్తోంది.
మృతుడి మిత్రులు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి సమాచారం అందించారు. తార్నాకలోని మథ్యూస్ నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారత విదేశాంగ శాఖ మృతుడి మరణవార్తను అతడి తల్లిదండ్రులకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది.

అమెరికాలో కాల్పులు: ఆరుగురు మృతి
అమెరికాలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి కాల్పులు జరిపిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మిచిగాన్‌లోని కలామజూ ప్రాంతంలోని క్రాకర్ బ్యారెల్ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ఆరుగురు మృతి చెందారని చెప్పారు.
కాల్పులకు పాల్పడిన వ్యక్తి వయసు సుమారు యాభై సంవత్సరాలు ఉంటుందని అనుమానిస్తున్నారు. కారులో వస్తూ ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యాడని చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు, ఓ అనుమానితుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications