ప్యారిస్‌లో ర్యాలీ: భారీ స్పందన, ఉప్పొంగిన అధ్యక్షుడు(ఫోటోలు)
న్యూఢిల్లీ: 'చార్లీ హెబ్డో' మృతులకు సంతాపం తెలుపుతూ, ఉగ్రవాదానికి ఏ మాత్రం భయపడేది లేదని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం దాడి, తదనంతర దాడుల్లో మరణించిన 17 మందికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తున్న శాంతి ఐక్యతా ర్యాలీకి హాజరుకావాలన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే పిలుపునకు అనూహ్య స్పందన లభించింది.
ఏకంగా పది లక్షల మంది ప్యారిస్ వీధుల్లోకి వచ్చారు. వివిధ దేశాల జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావంగా లక్షలాది మంది ''మీకు మేమున్నాం'' అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు. ఈ శాంతి ప్రదర్శనలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మాూద్ అబ్బాస్‌లతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలో మోర్కల్ దేశాధినేతలు పాల్గొన్నారు.
ఊహించని స్పందనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ "పారిస్... ఫ్రాన్స్‌కు మాత్రమే రాజధాని కాదు. ఇకపై ప్రపంచానికి రాజధాని" అని ఆయన అన్నారు. అంతేకాకండా ఉగ్రవాద దాడులకు ఏమాత్రం భయపడేది లేదని, ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్యారిస్‌లో ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
'చార్లీ హెబ్డో' మృతులకు సంతాపం తెలుపుతూ, ఉగ్రవాదానికి ఏ మాత్రం భయపడేది లేదని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ప్యారిస్‌లో ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఉగ్రవాదానికి ఏ మాత్రం భయపడేది లేదని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ప్రదర్శనలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మాూద్ అబ్బాస్‌లతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలో మోర్కల్ దేశాధినేతలు పాల్గొన్నారు.

ప్యారిస్‌లో ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఏకంగా పది లక్షల మంది ప్యారిస్ వీధుల్లోకి వచ్చారు. వివిధ దేశాల జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావంగా లక్షలాది మంది ''మీకు మేమున్నాం'' అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు.

ప్యారిస్‌లో ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఈ శాంతి ఐక్యతా ర్యాలీలో చిన్నారులు కూడా పాల్గొనడం విశేషం. చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావంగా లక్షలాది మంది ''మీకు మేమున్నాం'' అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు.

ప్యారిస్‌లో ఐక్యతా ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు
ఊహించని స్పందనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంలో మాట్లాడుతూ "పారిస్... ఫ్రాన్స్‌కు మాత్రమే రాజధాని కాదు. ఇకపై ప్రపంచానికి రాజధాని" అని ఆయన అన్నారు. అంతేకాకండా ఉగ్రవాద దాడులకు ఏమాత్రం భయపడేది లేదని, ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Click it and Unblock the Notifications