జపాన్ అద్భుత సృష్టి: కనిపించని రైలు (ఫోటో)
టోక్యో: జపనీస్ ఆర్కిటెక్ట్ కజుయో సెజిమా మరో అద్భుతాన్ని కళ్లముందు ఆవిష్కరించారు. కంటికి కనిపించని ఓ రైలుని రూపొందిచాడు. సెయిబు గ్రూప్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం ఏదైనా ప్రత్యేకంగా రూపొందించాలనే ఉద్దశంతో సంస్ధ ఈ అదృశ్య రైలుని తయారు చేశారు.
ఈ రైలు బోగీలన్నింటికీ ఒక సెమీ రిఫ్లెక్టివ్ కోటింగ్ వేశారు. దాంతో రైలు ప్రయాణిస్తుంటే దాదాపుగా కనిపించదు. కాగా, మరో రెండేళ్ల తరువాత ఈ రైళ్లు పట్టాలపైకి వస్తాయని తెలుస్తోంది. దాదాపుగా లివింగ్ రూమ్‌లా ఉండే సౌకర్యాలతో ఒక డిజైన్ కావాలని సెజిమాను ఆ గ్రూపు కోరగా... ఈ సరికొత్త డిజైన్‌ను ఆయన తయారుచేశారు.

తొలుత జపాన్ రాజధాని టోక్యో, సైతమా తదితర ఏరియాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సెయిబు గ్రూపునకు చెందిన సెయిబు రైల్వేస్ టోక్యో, సైతమా ప్రాంతాల్లో 180 కిలోమీటర్ల రైలు మార్గాలను నిర్వహిస్తుంది. పరిమిత సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రూటు రైళ్లకు దీన్ని అందించారు.
2018 నుంచి ఈ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడతాయని అంటున్నారు. ఈ సరికొత్త డిజైన్ రైళ్లను కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు మాత్రమే అందించనున్నారు. 1993 నుంచి కూడా సైయిబు గ్రూపు 10000 సిరిస్‌ను వాడుతోంది. జపాన్ బుల్లెట్ రైళ్లు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా చరిత్ర సృష్టించాయి.












Click it and Unblock the Notifications