వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు దేశాల మధ్య 'అందగత్తెల' సెల్ఫీ చిచ్చు: తనే వచ్చిందని...

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీరుట్: అందాల పోటీలో పాల్గొనే ముద్దుగుమ్మలకు చెందిన ఓ అంశంపై లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య వేడి రాజుకుంది. మిస్ లెబనాన్, మిస్ ఇజ్రాయెల్ కలిసి ఓ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటో సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది.

లెబనాన్ రాజధాని బీరుట్‌లో మిస్ యూనివర్స్ పోటీలు ఈ సంవత్సరం జరుగుతున్నాయి. ఈ పోటీలకు లెబనాన్ తరఫున సాలీ గ్రెయిగ్, ఇజ్రాయెల్ తరఫున డొరోన్ మెటలోన్ హాజరయ్యారు. జపాన్, స్లోవేనియా బ్యూటీలతో కలిసి తాము తీసుకున్న సెల్ఫీని డొరోన్ మెటలోన్ ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేసింది.

Miss Lebanon Criticized After Being Caught in Miss Israel’s Selfie

దీంతో వివాదం రాజుకుంది. సాలీ గ్రెయిగ్‌కు వ్యతిరేకంగా ఆమె సొంత దేశమైన లెబనాన్‌లో నిరసనలు చెలరేగాయి. అయితే, దీని పైన ఆమె తన దేశానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను జపాన్, స్లోవేనియాకు చెందిన వారితో సెల్ఫీ దిగుతుంటే మెటలోన్ మధ్యలో వచ్చిందని చెప్పింది.

తాము ఫోటో దిగుతుంటే హఠాత్తుగా వచ్చి సెల్ఫీ తీసిందని, అందరు కూడా తనకు మిల్ యూనివర్స్ పోటీల్లో మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు సాలీ గ్రెయిగ్ చెప్పింది. ఈ ఫోటో ఇన్‌స్ట్రాగ్రాంలోను డొరోన్ మెటలోన్ అప్ లోడ్ చేసింది. దాని కింద గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అస్, మిస్ జపాన్, మిస్ స్లోవేనియా, మిస్ లెబనాన్ అండ్ ఐ... అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

English summary
Miss Lebanon said she had been trying to avoid taking photos with Miss Israel, but Miss Israel initiated a selfie
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X