వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ ల్యూకేమియా: జైల్లో అమెరికా 'అందాల' బొమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి, వైద్యం కోసం సహాయం చేయాలని నమ్మించి చాలామంది నుంచి, చాలా సంస్థల నుంచి డబ్బులు కాజేసింది ఓ అమెరికా యువతి.

ఆమె గతంలో ఆందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది కూడా. మిస్ పెన్సిల్వినియా బ్రాండీ లీ వీవర్ గేట్స్.. తాను ల్యూకేమియాతో బాధపడుతున్నానని చెప్పి ఎంతోమంది నుంచి చాలా డబ్పులు వసూలు చేసింది.

Miss Pennsylvania shaved her head and FAKED cancer 'to con tens of thousands of dollars

అయితే, ఆమెకు ఎలాంటి వ్యాధి లేదని డాక్టర్లు నిర్ధారించారు. దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మిస్ పెన్సిల్వేనియా పోటీల్లో గెలుచుకున్న నగదును, కిరీటాన్ని తిరిగి ఇచ్చేయాలని అందాల పోటీ నిర్వాహకులు చెప్పారు.

బ్రాందీ లీ వీవర్ గేట్స్ వయస్సు 23. తనకు రెండేళ్లుగా ల్యూకేమీయా ఉందని చెబుతూ ఎంతోమంది నుంచి డబ్బులు వసూలు చేసింది. పలువురు విద్యార్థులు ఆమె కోసం చారిటీలు నిర్వహించారు. ఇటీవలే ఓ చారిటీ ఈవెంటులో 14వేల డాలర్లు వచ్చాయి. ఆమె నిజంగానే ల్యూకేమియాతో బాధపడుతోందని భావించి ఆమె చికిత్స కోసం చాలామంది పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు.

English summary
Miss Pennsylvania shaved her head and FAKED cancer 'to con tens of thousands of dollars from well-wishers to pay for made-up leukemia treatments'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X