విమానం హైజాక్: భారత్‌పై ఉగ్రవాద దాడికి వ్యూహం?
బీజింగ్: మలేషియా విమానం అదృశ్యం వ్యవహరం కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనపై విచారణను పూర్తి చేసిన అధికారులు విమానం హైజాక్ అయినట్లు వెల్లడించారు. విమానం నడపడంలో అనుభవమున్న పైలెట్లు హైజాక్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. హైజాకర్లు సమాచార వ్యవస్థ సిగ్నల్‌లను నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికుల్లోనే అధికారులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే హైజాక్‌కు గల కారణాలు తెలియరాలేదు, ఈ విషయంపై పూర్తి వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరించారు. సమాచార వ్యవస్థకు ఆటంకం కలిగించడంతో రాడార్‌లు కూడా విమానం జాడలను కనిపెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, భారత్‌లోని ఏదైనా మహా నగరంపై 9/11 తరహా దాడులు జరగవచ్చునని ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా విదేశాంగ శాఖ మాజీ ఉప మంత్రి స్ట్రోబ్ టాల్‌బోట్ చేసిన ట్వీట్ ఈ ఆందోళనకు కారణమవుతోంది. పరిస్థితిని బట్టి చూస్తే భారతదేశంలో దాడి చేయడానికి తగిన ఏర్పాట్లు విమానంలో చేసుకున్నట్లు అర్థమవుతోందని అన్నారు.
విమానం మాలే ద్వీపకల్పం మీదుగా అండమాన్ దీవుల వైపు వెళ్లిందని రాడార్ సమాచారాన్ని విశ్లేషించి అమెరికా మిలటరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చివరి సంకేతం సముద్రం పై నుంచి వచ్చిందని తెలిపారు. దీనినిబట్టి విమానాన్ని ఎవరైనా హైజాక్ చేసి ఉండవచ్చునని లేదా దారి తప్పిన విమానం హిందూ మహా సముద్రంలో కూలిపోయి ఉండవచ్చునని అంటున్నారు.
విమానం వారం రోజుల కిందటే మాయం కావడం ఏకంగా 13 దేశాల త్రివిధ దళాలు సముద్ర జలాల్లో గాలిస్తున్నా కనీసం కుప్పకూలిన ఆనవాళ్లు కూడా కనిపించకపోవడం తాజాగా మిలటరీ రాడార్ సంకేతాలు బయట పడడంతో విమానాన్ని హై జాక్ చేశారనే నిర్థారణకు వస్తున్నారు. రాడార్ మీద విమానం మాయమైన తర్వాత నాలుగు గంటల వరకు ఉపగ్రహానికి కూడా సంకేతాలు రావడంతో అది హిందూ మహా సముద్రంలో కుప్పకూలి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
