ఆస్ట్రేలియా పార్లమెంటులో మోడీ, కీలక ఒప్పందాలు
కాన్‌బెర్రా: భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య భావనలో ఐక్యంగా ముందుకెళ్దామన్నారు.
భారతీయ యువత మార్పు కోరుకుంటోందని, 30 ఏల్ల తర్వాత భారత్‌లో స్థిర ప్రభుత్వం వచ్చిందన్నారు. ఉగ్రవాదం అందరి సమస్య అన్నారు. భారత్ మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కుంటోందన్నారు. ప్రధాన రంగాల్లో ఆస్ట్రేలియా భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత ప్రజలు అభివృద్ధి, పారదర్శకత కోరుకుంటున్నారన్నారు.

ఒప్పందాలు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి.

నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అల్పోన్స్ ఎరినాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీతో కరచాలనం కోసం...

నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అల్పోన్స్ ఎరినాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ అభివాదం.

నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు అల్పోన్స్ ఎరినాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీతో కరచాలనం చేసేందుకు...
కాగా, భారత్ - ఆస్ట్రేలియా మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. సామాజిక, తీర ప్రాంత భద్రత, ఖైదీల బదలాయింపు, మాదక ద్రవ్యాల వాణిజ్యం అరికట్టడం, పర్యాటకం, సాంస్కృతిక రంగాలపై ఒప్పందాలు కుదిరాయి. మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
మోడీ మాట్లాడుతూ.. సామాజిక భద్రత ఒప్పందం సానుకూలమైన పరిణామమన్నారు. భద్రత సహకారంపై కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 2015లో ఆస్ట్రేలియాలో 'మేక్ ఇన్ ఇండియా' ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. భారత్ సూపర్ పవర్‌గా ఎదుగుతుందని ఆకాంక్షిస్తున్నామని అబాట్ అన్నారు. భారత్‌తో మరిన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications