మోడీ: ప్రపంచ కప్ ఆవిష్కరణ, టోనీతో సెల్ఫీ(పిక్చర్స్)
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కలిసి వచ్చే ఏడాది జరిగే క్రికెట్ ప్రపంచ కప్‌ను మెల్‌బోర్న్ స్టేడియంలో ఆవిష్కరించారు. భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్‌లతోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు మైకేల్ క్లార్క్, మెక్‌గ్రాత్, స్టీవ్ వా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ ఇచ్చిన విందును స్వీకరించిన అనంతరం మోడీ తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఫిజీ బయల్దేరారు. మంగళవారంతో ఆస్ట్రేలియా పర్యటన పూర్తయిందని, ఈ పర్యటనను తాను ఎన్నటికీ మర్చిపోలేనని మోడీ పేర్కొన్నారు. తన పర్యటన వల్ల ఆస్ట్రేలియా, భారత్ మధ్య కొత్త బంధం ఏర్పడిందని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మోడీకి విందు
అంతకుముందు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ భారత ప్రధాని మోడీతో పాటు పలువురికి విందు ఏర్పాటు చేశారు. మోడీతోపాటు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, క్లార్క్ తదితరులు విందుకు హాజరయ్యారు. మోడీ కోసం ప్రవాస భారతీయులు భారీ ఎత్తున స్టేడియం బయట బారులు తీరారు.
అక్కడికి చేరుకున్న మోడీ స్టేడియంలో టోనీ అబాట్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో నా స్నేహితుడు అబాట్‌తో' అని ఫొటో తోపాటు మోడీ ట్వీట్ చేశారు. 2015లో ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీతో ఫొటోలు దిగారు.

మోడీ
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌తో కలిసి వచ్చే ఏడాది జరిగే క్రికెట్ ప్రపంచ కప్‌ను మెల్‌బోర్న్ స్టేడియంలో ఆవిష్కరించారు.

మోడీ
భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్‌లతోపాటు ఆస్ట్రేలియా క్రికెటర్లు మైకేల్ క్లార్క్, మెక్‌గ్రాత్, స్టీవ్ వా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మోడీ
ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ ఇచ్చిన విందును స్వీకరించిన అనంతరం మోడీ తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఫిజీ బయల్దేరారు.

మోడీ
మంగళవారంతో ఆస్ట్రేలియా పర్యటన పూర్తయిందని, ఈ పర్యటనను తాను ఎన్నటికీ మర్చిపోలేనని మోడీ పేర్కొన్నారు.

మోడీ
తన పర్యటన వల్ల ఆస్ట్రేలియా, భారత్ మధ్య కొత్త బంధం ఏర్పడిందని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మోడీ
మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ భారత ప్రధాని మోడీతో పాటు పలువురికి విందు ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న మోడీ స్టేడియంలో టోనీ అబాట్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications