వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ - కమల హారిస్: అమెరికా ఉపాధ్యక్షురాలితో భారత ప్రధాని తొలి సమావేశం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను తొలిసారిగా గురువారం వాషింగ్టన్‌లో కలిశారు.

అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి దక్షిణాసియా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.

అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక కావడం చరిత్రాత్మకమని పేర్కొంటూ మోదీ ఆమెకు అభినందనలు తెలియజేశారు. భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.

"భారత ప్రజలు మీకు స్వాగతం పలకడానికి వేచి చూస్తున్నారు" అని మోదీ అన్నారు.

https://twitter.com/narendramodi/status/1441205902783041542

నవంబర్‌లో అమెరికా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన అనంతరం, కమలా హారిస్ గెలుపును పురస్కరించుకుని ఆమె పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో టపాసులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.

మోదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో తొలిసారిగా సమావేశం కానున్నారు. దాంతో, మూడు రోజుల పాటు కొనసాగిన భారత ప్రధాని అమెరికా పర్యటన ముగియనుంది.

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనుదిరిగిన కొన్ని వారాల్లోనే తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో తాలిబాన్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ, "భారతదేశంలో కశ్మీరీ ముస్లింల కోసం గొంతు విప్పుతాం" అన్నారు.

2019లో అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో, భారతదేశంలో ఆర్టికల్ 377 రద్దును కమలా హారిస్ ఖండించారు.

శుక్రవారం బైడెన్‌తో పాటూ మోదీ "క్వాడ్" సమావేశానికి హాజరు కానున్నారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు.

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలను, సహకారాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ప్రయత్నమే "క్వాడ్".

ఇవి కూడా చదవండి:

English summary
Modi - Kamala Harris: The first meeting of the PM of India with the Vice President of US
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X