వారి వల్లే రెచ్చిపోతున్నారు: మోడీని టార్గెట్ చేసిన చైనా మీడియా

భారత్‌పై చైనా మీడియా అక్కసు రోజు రోజుకూ పెరిగిపోతోంది. చైనా ప్రభుత్వం కంటే అక్కడి మీడియానే రెచ్చగొట్టే కథనాలను ప్రచురితం చేస్తోంది. భారత్ వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు కూడా చేయడం.

బీజింగ్: భారత్‌పై చైనా మీడియా అక్కసు రోజు రోజుకూ పెరిగిపోతోంది. చైనా ప్రభుత్వం కంటే అక్కడి మీడియానే రెచ్చగొట్టే కథనాలను ప్రచురితం చేస్తోంది. భారత్ వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు కూడా చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఇండియాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ మీడియా.. ఇప్పుడు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే లక్ష్యంగా చేసుకుంది.

హిందూ జాతీయవాదమంటూ..

హిందూ జాతీయవాదమంటూ..

ఇండియాలో పెరిగిపోతున్న హిందూ జాతీయవాదంతో ఇండో-చైనా మధ్య మరో యుద్ధం తప్పదని గ్లోబల్ టైమ్స్ పత్రిక స్పస్టం చేసింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచీ భారత జాతీయవాదులు చైనాపై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. హిందూ జాతీయవాదులను మోడీ ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోందని తెలిపింది.

మోడీ ప్రధాని అయిన తర్వాతే ఇలా..

మోడీ ప్రధాని అయిన తర్వాతే ఇలా..

మోడీ ప్రధాని అయిన తర్వాత భారత జాతీవాద సెంటిమెంటు మరింత బలపడిందని ఆ పత్రిక తెలిపింది. అంతేగాక, హిందూ జాతీయవాదాన్ని అడ్డం పెట్టుకుని మోడీ ప్రధాని అయ్యారని ఆరోపించింది. ఇప్పుడు సరిహద్దులో చైనా లక్ష్యంగా భారత్ బలగాల మోహరింపు కూడా ఆ జాతీయవాదుల డిమాండ్ల మేరకేనని ఆ పత్రిక తన ఎడిటోరియల్‌లో అభిప్రాయపడింది.

చైనాపై అనుమానాలు..

చైనాపై అనుమానాలు..

1962 యుద్ధం జరిగినప్పటి నుంచి చైనాపై భారత్‌కు అనుమానాలు పెరిగిపోయాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అందుకే వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా కావాలని ఆహ్వానించినా ఇండియా మాత్రం ఒప్పుకోవడం లేదని, అది చైనా నియంత్రణ, దేశాన్ని చుట్టుముట్టడం కోసం చేబడుతున్న ప్రాజెక్ట్‌గా అనుమానిస్తున్నదని తెలిపింది.

భారత్ కు‌హెచ్చరికలు

భారత్ కు‌హెచ్చరికలు

డోక్లాంలో నెలరోజులుగా ఉత్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఇతర పత్రికల కంటే కూడా గ్లోబల్ టైమ్స్ .. భారత్‌పై తన అక్కను వెళ్లగక్కుతోంది. యుద్ధం తప్పదని హెచ్చరించడం, ఆ తర్వాత చైనా బలగాలు సరిహద్దు సమీప ప్రాంతంలో మోహరించడం చక చకా జరిగిపోతున్నాయి. అంతేగాక, డోక్లాంలోనే కాదు రెండు దేశాల మధ్య వివాదంగా ఉన్న అన్ని చోట్లా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇంతకుముందు కూడా ఇదే పత్రిక భారత్‌ను హెచ్చరించడం గమనార్హం.

తగ్గేది లేదన్న భారత్..

తగ్గేది లేదన్న భారత్..

అయితే, చైనా బెదిరింపులకు తలొగ్గేది లేదని భారత్ స్పష్టం చేసింది. ఒక వేళ చైనాకు యుద్ధం చేయాలనుకుంటే తాము వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతంలో భారత బలగాలు కూడా మోహరించాయి. కాగా, భారత సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని టిబెట్ సరిహద్దులో చైనా ఇప్పటికే యుద్ధ విన్యాసాలను కూడా చేసింది. రోడ్డు మార్గం ద్వారా భారీగా యుద్ధ సామాగ్రిని తరలించింది. దీంతో సరిహద్దులో మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే హంకాంగ్, టిబెట్ ప్రాంతాలను తన ఆధీనంలో ఉంచుకున్న చైనా.. తన సామాజ్ర్య కాంక్షతో మరోసారి భారత్‌తో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+