వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ బంగ్లాదేశ్ పర్యటన: వ్యతిరేకిస్తూ నిరసనలు.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన పొరుగు దేశం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 26న బంగ్లదేశ్‌లో పర్యటించనున్నారు. అయితే, మోదీ రాకపై ఆ దేశంలో కొంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక సమూహం చేస్తున్న ఈ నిరసనల గురించి ఆందోళన చెందక్కర్లేదని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ అన్నారు.

"భారత ప్రధాని మోదీ ఢాకా పర్యటనకు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. కానీ, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందరికీ సమాన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది" అని ఆయన అన్నారు.

మోమెన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. "దేశంలో మెజారిటీ ప్రజలు మాతోనే ఉన్నారు. కొద్ది మంది మాత్రమే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని చేయనివ్వండి. ఇందులో ఆందోళన చెందడానికి కారణం మాకేమీ కనిపించట్లేదు" అని అన్నారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.

బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు(గోల్డెన్ జూబ్లీ) పూర్తి కానున్న సందర్భంగా మోదీ బంగ్లాదేశ్‌ను సందర్శించనున్నారు.

భారతదేశం సహాయంతో పశ్చిమ పాకిస్తాన్‌(ప్రస్తుత పాకిస్తాన్)కు వ్యతిరేకంగా తొమ్మిది నెలలపాటు విముక్తి పోరాటం జరిపిన తరువాత 1971, మార్చి 26న బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం లభించింది.

ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా బంగ్లాదేశ్‌లో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

మార్చి 9న ఫెని నదిపై వంతెన ప్రారంభోత్సవం జరిగింది. ఈ వంతెన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను, బంగ్లాదేశ్‌కు నేరుగా కలుపుతుంది. ఈ వంతెన ద్వారా ఛటోగ్రామ్ పోర్టు నుంచి సులభంగా ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నారు.

అయితే, భారత ప్రభుత్వ విధానాలపై బంగ్లాదేశ్‌లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. అదే కారణంగా ప్రస్తుతం మోదీ రాకను అక్కడ కొందరు నిరసిస్తున్నారు.

బంగ్లాదేశ్ అర్థ శతాబ్ది వేడుకలు మోదీని ఆహ్వానించారు

మోదీ రాకను వ్యతిరేకిస్తున్న వారు ఎవరు?

మోదీ బంగ్లాదేశ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆ దేశ రాజధాని ఢాకాలో శుక్రవారం ముస్లింలు, విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించినట్లు ఏపీ వార్తా సంస్థ తెలిపింది.

ఈ సంస్థ అందించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం బైతుల్ ముకర్రం మసీదు వెలుపల సుమారు 500 మంది ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

నిరసనకారుల చేతుల్లో ఎలాంటి బ్యానర్లూ లేవు. వారు ఏదైనా ఒక సంస్థకు చెందినవారా కాదా అనే విషయం స్పష్టంగా తెలియలేదు.

ఈ ర్యాలీలో భారతదేశానికి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోదీ చిత్రపటాన్ని అగౌరవపరిచారు. కొంతమంది 'గో బ్యాక్ మోదీ', 'గో బ్యాక్ ఇండియా' అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకున్నారు.

అంతే కాకుండా, వామపక్ష ఆలోచనలు ఉన్న సుమారు 200 మంది విద్యార్థులు ఢాకా యూనివర్సిటీ వెలుపల ర్యాలీ నిర్వహించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

మోదీని ఆహ్వానించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కూడా విమర్శించారు.

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్

భారత ప్రధానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన విదేశాంగ మంత్రి

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మోమెన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత ప్రధాని మా ఆహ్వానాన్ని మన్నించి మా దేశానికి విచ్చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉందని తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

బంగ్లాదేశ్‌కు వచ్చే దేశాధినేతలు అందరికీ తమ దేశ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని, భౌతిక దూరం పాటిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

సాంప్రదాయవాదులతో ఎలా వ్యవహరించాలో మా దేశ ప్రజలకు, ప్రధాని షేక్ హసీనాకు బాగా తెలుసని మోమెన్ అన్నారు.

బంగ్లాదేశ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో, జాతిపిత బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకు దక్షిణ ఆసియాకు చెందిన ఐదుగురు దేశాధినేతలు బంగ్లాదేశ్ విచ్చేస్తున్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎం షహ్రియార్ ఆలం తెలిపారు.

"నిరసన తెలియజేస్తున్నవారికి ఒక విజ్ఞప్తి.. మీరంతా మన జాతిపితను గౌరవిస్తున్నట్లైతే, దేశాన్ని ప్రేమిస్తున్నట్లైతే మన దేశానికి వచ్చే అతిధులను గౌరవించండి" అని ఆలం అన్నారు.

బంగ్లాదేశ్ అర్థ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని పది రోజుల కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలు మార్చి 17న ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి.

ఈ పర్యటనలో మోదీ బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్‌లో మటువా సముదాయాన్ని కలవనున్నారు.

అయితే, దీని వెనుక ఏదైనా రాజకీయ కారణం ఉందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఈ మీటింగ్‌కు ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

"పశ్చిమబెంగాల్ ఎన్నికలు బంగ్లాదేశ్‌కు సంబంధించిన విషయం కాదు. వారి రాజకీయ విషయాలతో బంగ్లాదేశ్‌కు సంబంధం లేదు. మోదీ మా దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించడం మాకు ఆనందం కలిగించే విషయమే. ఆయన మా అతిథి. ఆయన ఢాకా వెలుపల ప్రాంతాలను కూడా సందర్శించాలని కోరుకుంటున్నారు. అది మా దేశ పర్యటక రంగం అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది మంచి విషయమే" అని మోమెన్ అన్నారు.

గోపాల్‌గంజ్‌లోని మటువా సముదాయ పవిత్ర దేవాలయం తుంగీపారా, ఓర్కాండీలోని జాతిపిత స్మారక చిహ్నాలను మోదీ సందర్శించనున్నారు.

నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారీ కూడా రెండు రోజుల పర్యటనకు సోమవారం బంగ్లాదేశ్ చేరుకోనున్నారు. బంగ్లాదేశ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో పాల్గొనడమే కాకుండా ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు.

శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సే కూడా బంగ్లాదేశ్‌లో రెండు రోజులు పర్యటించారు.

"బంగ్లాదేశ్ పర్యటన విజయవంతమైంది. మాకు ఆతిధ్యం ఇచ్చినందుకు ఆ దేశ రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో పర్యటనను నేను ఆస్వాదించాను. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే విధంగా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని" రాజపక్సే తెలిపారు.

అభ్యంతరాలు

బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాలపై బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏ గురించి మాట్లాడుతూ హొం మంత్రి అమిత్ షా బంగ్లాదేశ్‌లో హిందువుల అణచివేత గురించి ప్రస్తావించారు. దీనిపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తంచేసింది.

"హిందువుల అణచివేత గురించి వారు చెబుతున్నది అనవసరం, అవాస్తవం. ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్‌లాంటి మతసామరస్యం ఉన్న దేశాలు చాలా తక్కువ. మాకిక్కడ మైనారిటీలు అంటూ ఎవరూ లేరు. మా దేశంలో అందరూ సమానమే. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీసే దిశగా భారతదేశం అడుగు వేయదని ఆశిస్తున్నాం. అవసరమైతే దీని గురించి భారత్‌తో చర్చిస్తాం" అని మోమెన్ వ్యాఖ్యానించారు.

భారతదేశంలోని పౌరసత్వ సవరణ బిల్లుల గురించి బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ కూడా అభ్యంతరాలు లేవనెత్తింది.

"అసోంలో ఎన్ఆర్‌సీ అమలు వలన బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వానికి ముప్పు" అని బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలమ్‌గీర్ గతంలో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Modi's visit to Bangladesh: Protests against Neighbouring country promised to provide strict security
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X