బంగ్లాదేశ్ ప్రధానిగా యూనస్ ప్రమాణం: మోడీ శుభాకాంక్షలు, వారి రక్షణకు పిలుపు
ఢాకా: షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా నోబెల్ విజేత 84 ఏళ్ల ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గురువారం అధ్యక్ష కార్యాలయం 'బంగభబన్'లో నిర్వహించిన కార్యక్రమంలో యూనస్ తో దేశాధ్యక్షుడు మొహమ్మద్ షబుద్దీన్ ప్రమాణం చేయించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఇటీవల వైదొలిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పాలన యంత్రాంగానికి యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రకటన వెలువరించారు. గురువారం ఉదయం ఫ్రాన్స్ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్.. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన యూనస్.. ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్తగా కొనసాగారు.

2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. చిట్టగాంగ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఇందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అంతేగాక, అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు.
హసీనా సర్కారుతో ఘర్షణపడినందుకు యూనస్‌పై పదుల కొద్ది కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది. బంగ్లాకు రెండోసారి విముక్తి లభించిందని గురువారం యూనస్ వ్యాఖ్యానించడం గమనార్హం.
My best wishes to Professor Muhammad Yunus on the assumption of his new responsibilities. We hope for an early return to normalcy, ensuring the safety and protection of Hindus and all other minority communities. India remains committed to working with Bangladesh to fulfill the…
— Narendra Modi (@narendramodi) August 8, 2024
మరోవైపు, బాధ్యతలు స్వీకరించిన యూనస్‌కి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ లో త్వరగా సాధారణ స్థితికి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రత, రక్షణ కోసం చర్యలు తీసుకోవాని కోరారు. శాంతిభద్రతలు, అభివృద్ధి కోసం ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బంగ్లాదేశ్‌తో కలిసి పనిచేసే విషయానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications