అరేబియా సముద్రానికి ఇరాన్ వార్..! ట్రంప్ కు ఖమేనీ ఘాటు వార్నింగ్..!

ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న యుద్దం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. తాజాగా ఇరాన్ ప్రతిపాదించిన సంధి ఒప్పందాన్ని తోసిపుచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు అయిపోగానే ఆ దేశంపై దాడుల్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. దీంతో ఇరాన్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అరేబియా సముద్రం నుంచి విదేశీ బలగాలను తరిమికొడతామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) హెచ్చరించారు. దేశ దక్షిణ తీరానికి సమీపంలోని జలాల నుండి తమ శత్రువులు ఇప్పటికే వెనక్కి తగ్గేలా ఇరాన్ బలగాలు ఒత్తిడి తెచ్చాయని ఖమేనీ పేర్కొన్నారు.

UPI MDR Row: యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ? తేల్చేసిన కేంద్రం..!
UPI MDR Row: యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ? తేల్చేసిన కేంద్రం..!

ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒక లిఖితపూర్వక ప్రకటనలో ఖమేనీ.. హార్ముజ్ జలసంధిని జాతీయ ప్రతిఘటనకు కీలకమైన ప్రదేశంగా అభివర్ణిస్తూ, ఇరాన్ సాయుధ బలగాలు ఘర్షణకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కొందరు తమను ప్రపంచంలో నాల్గవ అగ్రరాజ్యంగా చూస్తున్నారని, శత్రు బలగాలు అరేబియా సముద్రం దాటి వెళ్ళడానికి సాహసించడం లేదన్నారు. త్వరలోనే అరేబియా సముద్రం నుండి వారి ఉనికిని తుడిచిపెట్టే రోజు వస్తుందన్నారు. తమ ప్రజలు దేశవ్యాప్తంగా కూడళ్లను, వీధులను తమ బాధ్యతాయుతమైన ఉనికితో నింపుతున్నారన్నారు. దేశం చుట్టూ ఉన్న జలాల్లో ఇరాన్ బలగాలు తమ శత్రువులకు గణనీయమైన నష్టాలను కలిగించాయని ఖమేనీ పేర్కొన్నారు. గతంలో విదేశీ బలగాలు ఇరాన్ దక్షిణ సముద్రాల్లో సంచరించాయని, అయితే ఆ తర్వాత వారిని వెనక్కి తరిమివేశారని తెలిపారు.

Mojtaba Khamenei Warns Foreign Forces of Expulsion From Arabian Sea Days After Trump Rejects Iran Truce
బాలయ్య యాక్షన్ సీన్ క్లిప్ తో ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్..!
బాలయ్య యాక్షన్ సీన్ క్లిప్ తో ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్..!

దేశీయ ఐక్యతను చాటిచెప్పే ప్రయత్నంలో, వివిధ జాతి, సామాజిక నేపథ్యాలకు చెందిన ఇరానీయులు జలసంధిపై దేశ వైఖరికి మద్దతుగా నిలుస్తున్నారని ఖమేనీ తెలిపారు. ఇరాక్‌తో జరిపిన ఎనిమిదేళ్ల యుద్ధానికి, హిజ్బుల్లా నాయకుడు సయ్యద్ హసన్ నస్రల్లా వర్ధంతిని పురస్కరించుకుని జరుపుకునే పవిత్ర రక్షణ వారోత్సవాల సందర్భంగా ఖమేనీ ఈ సందేశాన్ని విడుదల చేశారు. ఇరాన్ స్వాతంత్రాన్నిదెబ్బతీయడానికి పాశ్చాత్య శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఆ సంఘర్షణ నుండి ఇస్లామిక్ రిపబ్లిక్ మరింత బలంగా బయటపడిందని ఖమేనీ పేర్కొన్నారు. 1953లో ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా జరిపిన తిరుగుబాటును కూడా ప్రస్తావిస్తూ, విదేశీ శక్తులు ఒకప్పుడు మానసిక ఒత్తిడిని, బెదిరింపులను ఉపయోగించి 25 సంవత్సరాల పాటు ఈ దేశ సంపదను దోచుకున్నాయని గుర్తుచేశారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఇరానీయులు దేశానికి అండగా నిలిచారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+