ప్రియుడితో 15 గంటల రొమాన్స్: కారులో ఊపిరాడక పిల్లలు మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన శారీరక సుఖం కోసం తన ఇద్దరు కవల పిల్లలను పొట్టన బెట్టుకుంది.

అమాండా హకిన్స్ అనే మహిళకు (19) రెండు సంవ‌త్స‌రాల‌ వయసున్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఈమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.

ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు..

ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు..

దీంతో ఆమె ప్రియుడితో కలిసి అమాండా పార్క్‌కి కారులో వెళ్లింది. తన వెంట త‌న ఇద్దరు పిల్ల‌లను కూడా తీసుకు వెళ్లింది. తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు తన ఇద్దరు పిల్లలను కారులో వదిలిపెట్టింది.

15 గంటల తర్వాత వచ్చింది

15 గంటల తర్వాత వచ్చింది

అనంతరం త‌న ప్రియుడితో క‌లిసి మ‌ద్యం తాగి, ఓ రూంలోకి వెళ్లి రాసలీలల్లో మునిగింది. కారులో పిల్ల‌ల‌ను వ‌దిలేసి వెళ్లిన పదిహేను గంటల త‌ర్వాత కారు వ‌ద్ద‌కి వ‌చ్చి చూసిన ఆ యువతి... త‌న పిల్ల‌లు చ‌నిపోయార‌ని గుర్తించింది.

పోలీసులు కేసు

పోలీసులు కేసు

అప్పటికీ కూడా ఆ మహిళకు ఇద్దరు పిల్లలు చనిపోయారన్న బాధలేకుండా మిన్నకుండిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.

ఏడ్చి, ఏడ్చి...

ఏడ్చి, ఏడ్చి...

ఆ మహిళ 16 ఏళ్ల బాలుడితో వెళ్లిందని, అప్పటి నుంచి పిల్లలు కారులో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆమె మంగళవారం రాత్రి వెళ్లిందని, పిల్లలను కారులో వదిలేసిన సమయంలో టెంపరేచర్ 80ఎస్ వద్ద ఉందని చెప్పారు. కారులో వారు ఏడ్చి, ఏడ్చి నిద్రపోయారని, ఆ తర్వాత చనిపోయారని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mom left tots in hot car to die, ignored cries, sheriff says.
Please Wait while comments are loading...