
Monkeypox : లైంగిక భాగస్వాముల్ని తగ్గించుకోండి-మంకీపాక్స్ పై పురుషులకు WHO సూచన
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ భయాలు పెరుగుతున్నాయి. భారత్ లోనూ కేరళలో మొదలైన మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి మిగతా రాష్ట్రాలకూ పాకుతోంది. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమవుతోంది. ఐసీఎంఆర్ వంటి సంస్ధలు మంకీపాక్స్ వ్యాప్తికి ఉన్న అవకాశాలపై చురుగ్గా పరిశోధనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) దీనిపై ఇవాళ ఓ కీలక సూచన చేసింది.
ముఖ్యంగా పురుషులకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ కీలక సూచనలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ మంకీపాక్స్ ముప్పు ఉన్న పురుషులకు లైంగిక భాగస్వాములను పరిమితం చేయడం గురించి ఆలోచించాలని సూచించారు. మంకీపాక్స్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో స్థానికంగా ఉంటుంది. ఇక్కడ ఎలుకలు లేదా చిన్న జంతువుల కాటు ద్వారా ప్రజలకు ఇది వ్యాప్తి చెందుతోంది. ఇది సాధారణంగా ప్రజలలో సులభంగా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్యసంస్ధ చెబుతోంది.

కానీ ఈ ఏడాది మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వ్యాధి కనిపించని దేశాలలో కూడా 15 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. యుఎస్, ఐరోపాలో పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఎక్కువ శాతం అంటువ్యాధులు సంభవించాయి. అయినప్పటికీ ఎవరైనా వైరస్ బారిన పడవచ్చని ఆరోగ్య అధికారులు చెప్తున్నారు.
ఇది ప్రధానంగా స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుందని గుర్తించారు.అయితే మంకీపాక్స్ ఉన్నవారు ఉపయోగించే నారబట్టల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని తేల్చారు. ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధిలా జనాభాలో కనిపిస్తున్నప్పటికీ, వ్యాప్తిని విస్తరించే ఇతర రకాల కారకాల గుర్తింపు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇలాంటి అనేక కేసులు ఉన్నాయి. యూఎస్ లో మంకీపాక్స్‌తో బాధపడుతున్న ఇద్దరు పిల్లలు, కనీసం ఎనిమిది మంది మహిళలను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు.
మంకీపాక్స్ సోకిన వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, అలసట, శరీర భాగాలపై గడ్డలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలా మంది పురుషులలో ఈ అనారోగ్యం తక్కువగా ఉంటుందని గుర్తించారు. అలాగే యూఎస్ లో ఇప్పటివరకూ మంకీపాక్స్ తో ఎవరూ చనిపోలేదు. కానీ ప్రజలు వారాలపాటు అంటువ్యాధికి గురికావొచ్చని, గాయాలు చాలా బాధాకరంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్