తైవాన్‌లో పేలుడు: 500మందికి గాయాలు(వీడియో)
తైపీ: తైవాన్‌లో శనివారం రాత్రి జల ఉద్యానవనం(వాటర్ పార్క్)లో సంభవించిన భారీ పేలుడు ఘటనలో క్షతగాత్రుల సంఖ్య 509కి చేరుకుంది. వీరిలో 188 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
న్యూతైపీ నగరంలోని రీక్రియేషన్ ఉద్యానవనంలో శనివారం రాత్రి సుమారు 10గంటల సమయంలో పేలుడు పదార్థాలు పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
క్షతగాత్రులను చికిత్స కోసం తైపీతోపాటు తావాన్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. న్యూతైపీ నగర చరిత్రలో ఒకే ప్రమాదంలో ఇంత మంది ఎప్పుడూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications