వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారియుపోల్‌లో రష్యా విధ్వంసం.. శిథిలాల కింది లక్ష‌మందికిపైగా పౌరులు : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలైన కీవ్, మరియుపోల్, ఉర్కీవ్ లు టార్గెట్ చేస్తూ క్షిపణులు, బాంబులతో రష్యా విరుచుకుపడుతోంది. భవనాలను ద్వంసం చేసింది. ఉక్రెయన్ సేనలు లొంగకపోవడంతో మాస్కో బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. సుందర నరగాలు మసిదిబ్బలుగా మారాయి. ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుముద్ర తీర ప్రాంత నగరమైన మరియుపోల్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బాంబుల వర్షంతో ప్రజలు భయంతో పారిపోతున్నారు. ఉన్నవారికి ఆహారం , నీరులేక అలమటిస్తున్నారు. అటు సుముద్ర తీరంలో యుద్ధనౌకలను మోహరించింది. భారీ క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది.

శిథిలాల కింద దాదాపు ల‌క్ష‌మంది..

శిథిలాల కింద దాదాపు ల‌క్ష‌మంది..


రష్యా దాడులతో మురియుపోల్‌లో దాదాపు లక్షమందికి పైగా చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 7 వేలమందికిపైగా నగరం నుంచి తప్పించుకున్నారు . కానీ శిథిలాలో ఇంకా లక్షమంది చిక్కుకున్నారని జెలెన్‌స్కీ తెలిపారు. మారియుపోల్ పౌరుల‌కు అవసరమైన ఆహారం , ఇతర సామాగ్రిని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అటు రష్యా సేనలను ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయని చెప్పారు. కీవ్‌కు సమీపంలో ఒక పట్టణాన్ని రష్యా సేనల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

15,600 మంది ర‌ష్యా సైనికులు హ‌తం

15,600 మంది ర‌ష్యా సైనికులు హ‌తం


రష్యాకు భారీగానే సైనిక నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు 15,600 మంది రష్యా సైనికుల్ని హతమార్చినట్లు వెల్లడించింది. అంతే కాకుండా 101 యుద్ద విమానాలు, 1245 యుద్ధ హెలికాప్టర్లు కూల్చివేసినట్లు వివరించింది. అలాగే 517 యుద్ధ ట్యాంకులు, 1578 ఆర్మ్ డ్ వాహనాలు, 267 పిరంగులు, 1008 వాహనాలు, నాలుగు యుద్ధ నౌకలు, యుద్ధ సామాగ్రిని ధ్వంసం చేసినట్లు తెలిపింది.

 రష్యాపై ఆంక్ష‌లు తీవ్ర‌త‌రం ..

రష్యాపై ఆంక్ష‌లు తీవ్ర‌త‌రం ..


రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జపాన్ ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ఒత్తిడి పెంచినట్లు అవుతోందని పేర్కొన్నారు. జపాన్ పార్లమెంటును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ జెలెన్‌స్కీ ప్రసంగించారు. రష్యా చెందిన వస్తువులపై వాణిజ్య నిషేదం విధించాలని కోరారు. ఉక్రెయిన్‌లో శాంతిపునరుద్ధరణకు ఆసియాలో తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తెచ్చిన దేశం జపాన్ మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయంపై కృతజ్ఞతలు తెలిపారు.

English summary
More than One lakh people under the rubble in Mariupol says Ukraine President Zelensky
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X