వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్లాంటోడే: ట్రంప్ ను చీ అంటున్నఅమెరికన్లు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్నరిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ నోరు కంపు అని, ఆయన గారికి మహిళలు అంటే గౌరవం లేదని అమెరికన్లు అంటున్నారు. ఇలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయితే మహిళలకు భద్రతకు కష్టం అని అమెరికా ప్రజలు అంటున్నారు.

తాజాగా ఏపీ-జీఎఫ్ కే సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని తనపై వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఖండిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం ఆయన మీద వచ్చిన ఆరోపణలను నమ్ముతున్నారు.

డోనాల్డ్ ట్రంప్ పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని తాజా సర్వేలో వెలుగు చూసింది. ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నారా ? లేదా ? అని ఏపీ-జీఎఫ్ కే సర్వే చేసింది. ఆ సర్వేలో 72 శాతం మందికి పైగా అమెరికన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Most Americans belive allegations against Trump: poll

వారిలో 36 శాతం మంది డోనాల్డ్ ట్రంప్ మీద వచ్చిన ఆరోపణలు నమ్ముతున్నామని చెప్పడం గమనార్థం. 2005లో ఓ వివాహితతో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ఆడియో టేపులు ఇప్పుడు బయటకు రావడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కింది.

పోర్న్ చిత్రాల నటీతో సహ ఇప్పటి వరకు 14 మంది మహిళలు ఆయన గారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని డోనాల్డ్ ట్రంప్ బాధిత మహిళలు మీడియా ముందు వాపోయారు.

ఈ ఆరోపణలను మీడియా ముందే డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇదంతా ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కేవలం 8 రోజులు మాత్రమే ఉన్న సమయంలో అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సర్వేలు అన్నీ హిల్లరీకి అనుకూలంగా ఉండడంతో డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడికి గురైనారు.

కొన్ని సంవత్సరాల తరువాత తాను పుట్టి ఉంటే కచ్చితంగా నా కూతురితో సహజీవనం చేసేవాడిని అంటూ డోనాల్డ్ ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. సొంత కుమార్తె మీద ఆయనకు ఇలాంటి అభిప్రాయం ఉంటే అమెరికన్ మహిళల మీద ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది ? అసలు మాకు భద్రత ఉంటుందా ? అని అమెరికన్ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

English summary
Even among Donald Trump's supporters, the poll found that 35 per cent think the accusations are probably true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X